Begin typing your search above and press return to search.

స్టార్స్‌ హోరా హోరీ.. మ‌ధ్య‌లో యంగ్ స్ట‌ర్స్ సందెట్లో హ‌ల్ చ‌ల్‌

By:  Tupaki Desk   |   9 April 2022 9:31 AM GMT
స్టార్స్‌ హోరా హోరీ.. మ‌ధ్య‌లో యంగ్ స్ట‌ర్స్ సందెట్లో హ‌ల్ చ‌ల్‌
X
టాలీవుడ్‌, కోలీవుడ్, సాండ‌ల్ వుడ్, బాలీవుడ్ .. ఇలా ఎక్క‌డ చూసినా ఇప్ప‌డు పాన్ ఇండియా సినిమాలు.. వంద కోట్ల చిత్రాల హ‌డావిడే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. బ‌డ్జెట్ లెక్క‌ల ప్ర‌క‌రాం సినిమాల‌ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. పెద్ద చిత్రాలు రిలీజ్ రెడీ అవుతున్న వేళ చిన్న చిత్రాలు కూడా సై అంటూ రంగంలోకి దిగేస్తున్నాయి. ఓ ప‌క్క స్టార్స్ మ‌ధ్య హోరా హోరీ ఫైట్ కి రంగం సిద్ధ‌మ‌వుతుంటే యంగ్ స్ట‌ర్స్ మూవీస్ సందెట్లో స‌డేమియా అంటూ మ‌ధ్య‌లో దూరి హ‌ల్ చ‌ల్ చేయ‌డానికి సై అంటూ కాలు దువ్వుతున్నాయి. రొమాంటిక్ ల‌వ్ స్టోరీస్ కావ‌డంతో ఈ చిత్రాల‌పై కూడా అంచ‌నాలున్నాయి.

ఈ నెల 13 నుంచి 'బీస్ట్' మూవీతో స్టార్ హీరోల చిత్రాల హంగామా ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 14న రాఖీ భాయ్ య‌ష్ న‌టించిన 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' రిలీజ్ ఆక‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద అస‌లు హంగామా ప్రారంభం కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రాల‌తో పాటు స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్ లు డిక్లేర్ అయిపోయాయి. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద స‌మ్మ‌ర్ స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా మార‌బోతోంది. ఇదిలా వుంటే స్టార్ హీరోల చిత్రాల మ‌ధ్య యంగ్ హీరోల చిత్రాలు కూడా పోటా పోటీగా రిలీజ్ కాబోతున్నాయి.

ఈ వ‌రుస‌లో ఏప్రిల్ 22న నాగశౌర్య హీరోగా న‌టించిన రొమాంటిక్ డ్రామా 'కృష్ణ వ్రింద విహారి' విడుద‌ల కాబోతోంది. అనిష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ద్వారా షిర్లే సెటియా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. స‌రికొత్త నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నాగ‌శౌర్య బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా న‌టించారు. శౌర్య సొంత బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు.

నిఖిల్ హీరోగా న‌టించిన '18 పేజెస్‌' రిలీజ్ కు రెడీ అయిపోతోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ రూపొందించారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మించిన ఈ మూవీ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందింది. త్వ‌ర‌లోనే ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు.

సంతోష్ శోభ‌న్ , గౌరీ కిష‌న్ జంట‌గా న‌టించిన చిత్రం 'శ్రీ‌దేవి శోభ‌న్ బాబు'. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజ‌ర్ ని ఇటీవ‌ల హీరోయిన్ సమంత విడుద‌ల చేసింది. తొలి టీజ‌ర్ తోనే ఈ మూవీ విశేషంగా ఆక‌ట్టుకుంటుండ‌టంతో థియేట‌ర్ల‌లో ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డం ఖాయం అంటున్నాక‌రు. ఇక ఇదే బాట‌లో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టించిన 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం' విడుద‌ల కాబోతోంది. రుక్సార్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందింది. దీనిపై విశ్వ‌క్ సేన్ భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు.

వీళ్ల‌తో పాటు 'ఉప్పెన‌' ఫేమ్ పంజా వైష్ణ‌వ్ తేజ్ కూడా రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్నాడు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం 'రంగ రంగ వైభ‌వంగ‌'. బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా త‌మిళ ద‌ర్శ‌కుడు గిరీషాయ తెలుగు తెర‌కు ప‌రిచయం కానున్నారు. 'రొమాంటిక్' ఫేమ్ కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం జూలై 1న థియేట‌ర్లలోకి రాబోతోంది. ఏప్రిల్ నుంచి జూలై వ‌ర‌కు ఇలా స్టార్ హీరోల చిత్రాల‌తో యంగ్ హీరోల రొమాంటిక్ మూవీస్ పోటీకిదిగుతుండ‌టం విశేషం.