Begin typing your search above and press return to search.

రాత్రి 8 గంటల వరకు నాకో బాయ్ ఫ్రెండ్‌ కావాలి

By:  Tupaki Desk   |   28 Feb 2022 7:40 AM GMT
రాత్రి 8 గంటల వరకు నాకో బాయ్ ఫ్రెండ్‌ కావాలి
X
బాలీవుడ్‌ స్టార్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బూతు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు అంటూ అరెస్ట్‌ అయిన సమయంలో మోడల్ మరియు నటి అయిన గెహాన వశిష్ఠ్‌ వార్తల్లో నిలిచింది. మొదట రాజ్ కుంద్రా అమాయకుడు.. ఆయన నిర్ధోశి అంటూ వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత బూతు సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో ఈమెను రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా గెహాన వశిష్ఠ్‌ వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. 15 లక్షల లంచం ఇస్తా అరెస్ట్‌ చేయవద్దంటూ పోలీసులతో డీల్‌ కుదుర్చుకునేందుకు ప్రయత్నించిందని కూడా ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఈమె గురించి ఆ సమయంలో వచ్చిన వార్తలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి.. అసలు ఎవరు ఈమె అంటూ సోషల్‌ మీడియాలో గూగుల్‌ లో ఈమె గురించి తెగ వెదికేశారు.

అరెస్ట్‌ అయ్యి కొన్నాళ్ల పాటు జైల్లో కూడా ఉన్న ఈమె ఇటీవలే బెయిల్‌ మీద బయటకు వచ్చింది. బెయిల్‌ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చగా ఫోటో షూట్‌ లను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆమె రాత్రికి రాత్రి ఒక బాయ్ ఫ్రెండ్‌ కావాలంటూ ప్రకటన చేయడం హాట్‌ టాపిక్ అయ్యింది.

తాజాగా ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఈ అమ్మడు.. ఒంటరితనం భరించలేక పోతున్నాను. నేను తొందరపడుతున్నాను. నాకు వీలైనంత త్వరగా ఒక తోడు కావాలి. బాయ్ ఫ్రెండ్‌ రూపంలో ఆ తోడు కోరుకుంటున్నాను. నాకు బాగా అందగాడు.. డబ్బున్న వ్యక్తి.. తెలివైన వాడు తోడు కావాలని కోరుకుంటున్నాను. నాకు ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కావాలి. అప్పటి వరకు ఈ విషయాన్ని నేను లాక్‌ చేయాలనుకుంటున్నాను.

ఎవరైతే నాలా ఒంటరిగా ఉన్నారో వారు నాకు వెంటనే మెసేజ్ చేయండి.. లేదంటే నన్ను సంప్రదించండి అంటూ బాహాటంగా ప్రకటించింది. ఈమె ప్రకటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. మరీ ఇంత ఓపెన్‌ గా బాయ్ ఫ్రెండ్‌ కావాలని.. అది కూడా రాత్రి 8 గంటల వరకు బాయ్ ఫ్రెండ్‌ కావాలంటూ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.