Begin typing your search above and press return to search.

జ‌క్కన్న స్పందించారు..కానీ స్పెష‌ల్ థాంక్స్ మాత్రం

By:  Tupaki Desk   |   9 March 2022 9:42 AM GMT
జ‌క్కన్న స్పందించారు..కానీ స్పెష‌ల్ థాంక్స్ మాత్రం
X
గ‌త కొన్ని నెల‌లుగా ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో టాలీవుడ్ నిర్మాత‌ల పాలిట శాపంగా మారింది. చాలా వ‌ర‌కు భారీ చిత్రాలు ఏపీ తీసుకొచ్చిన 35 జీవో కార‌ణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. దీంతో ఈ జోవోని ఏపీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయాల‌ని కోరుతూ చిరంజీవి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తో ప్ర‌త్యేక భేటీ కావ‌డం తెలిసిందే. ఆ త‌రువాత మ‌రోసారి జ‌రిగిన ప్ర‌త్యేక భేటీలో చిరుతో పాటు మ‌హేష్‌, రాజ‌మౌళి, ప్ర‌భాస్‌, కొర‌టాల శివ త‌దిత‌రులు పాల్గొన్నారు. అప్ప‌టి నుంచి కొత్త జీవో వ‌స్తుంద‌ని ఎదురుచూసిన టాలీవుడ్ వ‌ర్గాల‌కు ఏపీ ప్ర‌భుత్వం తాజాగా తీపి క‌బురు వినిపింది.

టికెట్ రేట్ల‌పై తీసుకొచ్చిన పాత జీవోని స‌వ‌రిస్తూ తాజాగా సోమ‌వారం కొత్త జీవోని విడుద‌ల చేసింది. ఈ జీవోపై మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌భాస్, ఆర్ . నారాయ‌ణ మూర్తి ముందుగా స్పందించారు. కొంత ఆల‌స్యంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏపీ ప్ర‌భుత్వంపై, సీఎం జ‌గ‌న్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇదే స‌మ‌యంలో ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ స‌భ్యులు కూడా తాజా జీవో ప‌ట్ల హ‌ర్షం వ్యక్తం చేశారు. అయితే ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోలో చాలా వ‌ర‌కు మెలిక‌లు వుండ‌టంతో చాలా మంది ఈ జీవోపై స్పందించ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో స్టార్ డైరెక్ట‌ర్లు ఎవ‌రూ ఈ జీవోపై స్పందించ‌క‌పోవ‌డంతో నిజంగానే ఈ జోవోపై అస‌హ‌నంతో వున్నారా? అనే వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే లేట్ గా అయినా స‌రే రాజ‌మౌళి లేటెస్ట్ గా స్పందించారు. ఏపీ ప్ర‌భుత్వాన్ని పొగుడుతూనే తెలంగాణ సీఎంకు పెద్ద పీట వేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కొత్త జీవో లో స‌వ‌రించిన టికెట్ ధ‌ర‌ల ద్వారా తెలుగు సినిమాకి స‌హాయం చేసినందుకు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్, మంత్రి పేర్ని నాని గారికి ధ‌న్య‌వాదాలు.

ఈ జీవో సినిమా ప‌రిశ్ర‌మ మ‌ళ్లీ మునుప‌టిలా పుంజుకోవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను` అని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు రాజ‌మౌళి.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ని, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ కు రాజ‌మౌళి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. పెద్ద చిత్రాల‌కు రోజుకు 5 షోల‌ను అనుమ‌తించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి, తెలంగాణ ప్ర‌భుత్వానికి బిగ్ థ్యాంక్స్ అని మ‌రో ట్వీట్ చేశారు. అంతే కాకుండా మారు నిరంత‌రం స‌హ‌క‌రిస్తున్న మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ గానికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

అంటే ఒకేసారి రెండు రాష్ట్ర ప్ర‌భుత్వ సీఎం ల‌పై రాజ‌మౌళి ప్ర‌త్యేకంగా ట్వీట్ లు చేయ‌డం, అందులో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్ కి స్పెష‌ల్ గా బిగ్ థాంక్స్ అంటూ పేర్కొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మీ కంటే తెలంగాణ ప్ర‌భుత్వ‌మే సినీ ఇండ‌స్ట్రీకి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తోంద‌ని రాజ‌మౌళి ఇండైరెక్ట్ గా చుర‌క‌లంటించారా? అని నెట్టింట ప్ర‌స్తుతం చ‌ర్చ మొద‌లైంది.