Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ సినిమా స్టే కోరిన వ్యక్తికి రివర్స్‌ గా రూ.10 లక్షల ఫైన్‌!

By:  Tupaki Desk   |   6 March 2022 4:30 AM GMT
మెగాస్టార్‌ సినిమా స్టే కోరిన వ్యక్తికి రివర్స్‌ గా రూ.10 లక్షల ఫైన్‌!
X
బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబచ్చన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా కమ్‌ బయోపిక్ ఝూండ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల ముందు విడుదలకు స్టే ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును నంది చిన్ని కుమార్‌ ఆశ్రయించాడు. సినిమా హక్కులను తాను తీసుకున్నాను అని.. కాని బాలీవుడ్‌ మేకర్స్ సినిమా ను చేశారంటూ ఝూండ్ యూనిట్‌ సభ్యులపై ఫిర్యాదు చేశాడు.

హైకోర్టును ఆశ్రించిన పిటీషనర్‌ సమర్పించిన సాక్ష్యాలు సరిగా లేని కారణంగా దురుద్దేశ్యంతో సినిమా ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు అంటూ దర్మాసనం నిర్థారణకు వచ్చింది. ఇలాంటి దురుద్దేశ కేసులు.. బ్లాక్ మెయిల్‌ కేసులు మళ్లీ మళ్లీ రాకూడదు అనే ఉద్దేశ్యంతో తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఏకంగా పది లక్షల జరిమానాను సదరు పిటీషనర్ కు విధిస్తున్నట్లుగా తీర్పు ఇచ్చింది.

ఆ పది లక్షల జరిమానాను కూడా కోవిడ్‌ ఫండ్ గా ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకోవాలని కూడా ధర్మాసనం పేర్కొంది. నెల రోజుల్లో పిటీషనర్‌ ఒక వేళ ఆ పది లక్షల రూపాయలను జమ చేయకుంటే హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆ పది లక్షల రూపాయలను ఆ వ్యక్తి నుండి జమ చేయాల్సి ఉంటుందని కోర్టు ఆదేశాల్లో పేర్కొన్నారు.

 ఆ జరిమానా మొత్తం ను కూడా 30 రోజుల్లోనే జమ చేయాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఝూండ్ సినిమా ఒక సామాజిక కార్యకర్త అయిన విజయ్ బర్సే అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. స్లమ్‌ పిల్లలకు ఫుట్‌ బాల్‌ కోచ్ గా బిగ్ బి ఈ సినిమా లో కనిపించాడు. పెద్ద ఎత్తున సినిమా పై జనాల్లో ఆసక్తి కలిగింది.

సినిమా విడుదల సమయంలో ఆర్థిక సమస్యలు రావడంతో విడుదల కష్టంగా మారిందనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే అమితాబచ్చన్‌ ముందుకు వచ్చాడు.

మంచి మనసు చాటుకున్న అమితాబచ్చన్‌ తన పారితోషికంను తగ్గించుకుని బయ్యర్లతో మరియు ఇతర యూనిట్‌ సభ్యులతో మాట్లాడి విడుదలకు మార్గం సుగమం చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో సినిమా విడుదల పై స్టే కోరుతూ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కోర్టు తప్పుడు కేసు అంటూ ఆ పిటీషనర్‌ వాదనను కొట్టి పారేసి ఏకంగా పది లక్షల జరిమానాను విధించింది.