Begin typing your search above and press return to search.
'కాంతార' కాసుల వర్షం కురిపిస్తుందా?
By: Tupaki Desk | 15 Oct 2022 4:30 PM GMTతెలుగులో గంతంలో అమిళ డబ్బింగ్ సినిమాలు సందడి చేసేవి. కానీ ఇప్పుడు కన్నడ సినిమా రీసౌండ్ ఇవ్వడం మొదలు పెట్టింది. `కేజీఎఫ్` సిరీస్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో తెలుగులో అంతా పరిచయం లేని హీరోల సినిమాలు కూడా మన బాక్సాఫీస్ వద్ద రాణించాలని పోటీపడుతున్నాయి. `కేజీఎఫ్` వేసిన బాటలో `కేజీఎఫ్ 2` వంటి ట్రెమండస్ హిట్ తరువాత కన్నడ ఇండస్ట్రీ దేశ వ్యాప్తంగా జోరు చూపించడం మొదలు పెట్టింది. రక్షిత్ శెట్టి `చార్లీ 777, కిచ్చా సుదీప్ `విక్రాంత్ రోణ` వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగేలా చేశాయి.
అయితే తాజాగా విడుదలైన `కాంతార` ఇప్పడు కన్నడ ఇండస్ట్రీ దేశ వ్యాప్తంగా మారుమోగేలా చేస్తోంది. పక్కా కన్నడ నేటివిటీతో దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి నటించి రూపొందించిన ఈ మూవీ కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేశారు. కన్నడ సంప్రదాయాలకి అద్దంపడుతూ రూపొందిన ఈ మూవీ తెలుగులోనూ ప్రేక్షకుల్ని ఆకర్షించడం ఖాయం అని చెబుతున్నారు.
`కేజీఎఫ్` మేకర్స్ హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని ఇప్పటికే హీరో ప్రభాస్ రెండు సార్లు చూశారట. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల దృష్టిపడింది. అయితే కన్నడ నేటి విటీ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో త్వరగా మన వాళ్లని ఎట్రాక్ట్ చేయడం కష్టంగానే వున్నా క్రమ క్రమ క్రమంగా ఈ మూవీ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రొటీన్ సినిమాలకు పూర్తి భిన్నంగా సాగే కొత్త కథ, హీరో రిషబ్ శెట్టి అభినయం, సరికొత్త నేపథ్యం ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేయడానికి ప్రధాన బలంగా నిలవబోతున్నాయి. ముందు ఒక్క క్న్నడలో మాత్రమే విడుదలైన ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో విడుదలైన ఈ మూవీ అక్కడ మంచి ఓపెనింగ్స్ ని రాబట్టి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగులోనూ అదే స్థాయి టాక్ ని రాబట్టింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.