Begin typing your search above and press return to search.

సూర్య సేఫ్ గేమ్ ఆడ‌టంలో వైఫ‌ల్యం!

By:  Tupaki Desk   |   11 March 2022 5:29 AM GMT
సూర్య సేఫ్ గేమ్ ఆడ‌టంలో వైఫ‌ల్యం!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌ టాలీవుడ్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు హీరో అనే భావ‌న‌తోనే సూర్యి తెలుగు అభిమానులు ఆరాదిస్తారు. ర‌జ‌నీకాంత్..క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్ హీరోల త‌ర్వాత అంత‌టి అభిమానం చూరగొన్న స్టార్ హీరో సూర్య‌. ఆ ర‌కంగా సూర్య‌కి ఎలాంటి ఢోకా లేదు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకు సూర్య చిత్రాలు క‌నెక్ట్ అవుతుంటాయి. యూనిక్ అప్పీల్ ఉన్నా క‌మ‌ర్శియాల్టీని కోల్పోకుండా సేఫ్ కంటెంట్ ని ఎంచుకోవ‌డంలో సూర్య దిట్ట‌.

తెలుగు..త‌మిళ్ రెండింటికీ క‌నెక్ట్ అయ్యే కంటెంతోనే ప్రేక్ష‌కుల ముందుకొస్తుంటారు. అయితే ఈసారి ఆ లెక్క కాస్త త‌ప్పిన‌ట్లే క‌నిపిస్తోంది. సూర్య హీరోగా న‌టంచిన 'ఈటి' మార్చి 10న రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య తెలుగు..త‌మిళ్ లో రిలీజ్ అయింది. అయితే సినిమాకి మొద‌టి షోతోనే నెగిటివ్ టాక్ వ‌చ్చింది. రొటీన్ కంటెంట్ అనే విమ‌ర్శ‌ల్ని ఎదుర్కుంటున్నారు. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌లేదు.

నేరుగా ఈ చిత్రాన్ని థియేట‌ర్లోనే రిలీజ్ చేసారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు పెద్ద‌గా ప్ర‌చారం క‌ల్పించ‌లేదు. తూతూ మంత్రంగానే అన్ని కార్య‌క్ర‌మాల్ని కానిచ్చేసారు. ఆ సంగ‌తిని ప‌క్క‌న బెడితే స‌రిగ్గా పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్' రిలీజ్ కి ముందు రోజు తీసుకురావ‌డం మ‌రో పెద్ద త‌ప్పు. కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే థియేట‌ర్లు దొరుకుతాయి. ఆ మ‌రుస‌టి రోజు నుంచి 'రాధేశ్యామ్' థియేట‌ర్లు అన్నీ ఆక్యెపై చేస్తుంద‌న్న సంగ‌తి తెలిసి మరీ తేవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం.

అయితే ఈ విష‌యంలో మేక‌ర్స్ అంచ‌నాలు త‌ప్పు అయ్యాయి అన్న విమ‌ర్శ వినిపిస్తోంది. సూర్య గ‌త రెండు చిత్రాలు 'ఆకాశ‌మే నీ హ‌ద్దురా'.. 'జైభీమ్' చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ఈ రెండు చిత్రాల్ని ఓటీటీ రిజీల్ చేయ‌డంపై అభిమానులు అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ఆ రెండు చిత్రాల‌కు సూర్య నిర్మాత కావ‌డం..క‌రోనా పీక్స్ లో ఉన్న స‌మ‌యం కావ‌డంతో ఓటీటీకి వెళ్లిపోయారు. అయితే ఆ రెండు చిత్రాలు కూడా థియేట‌ర్లో రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద స‌క్సెస్ అయ్యేవి అని అప్ప‌ట్లోనే టాక్ వ‌చ్చింది.

రెండు డిఫ‌రెంట్ జాన‌ర్ చిత్రాలు. ఓ ర‌కంగా చెప్పాలంటే సూర్య మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుంటే అన్ని వ‌ర్గాలకి క‌నెక్ట్ అవ్వ‌డం క‌ష్టం. ఆ ర‌కంగా సూర్య ఓటీటికి వెళ్లిన‌ట్లు టాక్ ఉంది. కానీ 'ఈటి' ప‌క్కా మాస్ చిత్రం. రొటీన్ జాన‌ర్. అందుకే ఓటీటీకి వెళ్ల‌కుండా నేరుగా థియేట‌ర్లోకి వ‌చ్చారు. కానీ ప్రేక్ష‌కులు పెద‌వి విరిచేసారు. ఇదే సినిమా ఓటీటీ తో ఒప్పందం చేసుకుంటే లాభాల్లో ఉండేవారు? అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసినా ఆద‌ర‌ణ ద‌క్కడం క‌ష్ట‌మ‌నే విమ‌ర్శ వినిపిస్తోంది.

గ‌తంలో ధ‌నుష్ న‌టించిన 'జ‌గ‌మే తంధిర‌మ్'..'మార‌న్' చిత్రాల కంటెంట్ విష‌యంలో సందేహంతో నేరుగా ఓటీటీ వెళ్లిపోయి లాభ‌ప‌డ్డారు. వాస్త‌వానికి ఈ రెండు చిత్రాల్ని థియేట‌ర్లో రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ కంటెంట్ పై సందేహంతో ఓటీటీకి విక్ర‌యించి సేఫ్ జోన్ రిలీజ్ చూసుకుని స‌క్సెస్ అయ్యారు.