Begin typing your search above and press return to search.
థియేటర్ మొత్తం అండర్ ఫ్యాన్స్ కంట్రోల్
By: Tupaki Desk | 7 March 2022 9:33 AM GMTసినీ తారల్ని అభిమానులు డెమీగాడ్స్ గా భావిస్తూ పూజిస్తుంటారు. వారి కోసం ఎంత వరకు వెళ్లడానికైనా.. ఏం చేయడానికైనా వెనుకాడరు. అదే విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాజాగా మరో సారి రుజువు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం వరుసగా టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల పరం పర నడుస్తోంది. ఏ హీరోని కదిలించినా పాన్ ఇండియా మూవీ ముచ్చట్లే. ఈ నెలలో టాలీవుడ్ నుంచి రెండు పాన్ ఇండియా మూవీస్ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` ఈ నెల 11న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.
ఇక ఈ మూవీ రిలీజ్ అయిన రెండు వారాల విరామం తరువాత మరో పాన్ ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కాబోతోంది. తెలుగు నుంచి ఒకే సారి రెండు వారాల వ్యవధితో పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతుండటంతో ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు చిత్రాల్లో మార్చి 25న విడుదల కానున్న `ఆర్ ఆర్ ఆర్` ఎన్టీఆర్ అభిమానులు చేసిన పని కారణంగా వార్తల్లో నిలిచింది. వరల్డ్ వైడ్ గా `రాధేశ్యామ్` టికెట్ బుకింగ్స్ హల్ చల్ చేస్తున్న వేళ `ఆర్ ఆర్ ఆర్` బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
10న `రాధేశ్యామ్` యుఎస్ ప్రీమియర్స్ ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 25న `ఆర్ ఆర్ ఆర్` ప్రీమియర్స్ కు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో `ఆర్ ఆర్ ఆర్` రికార్డుల మోత మోగించడం మొదలుపెట్టింది. గత కొంత కాలంగా వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న థియేటర్లలోకి రానుండటంతో మెగా ఫ్యాన్స్ , నందమూరి అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రికార్డు స్థాయిలో ఇప్పటికే టికెట్స్ ని బ్లాక్ చేసేశారు కూడా. దీంతో `ఆర్ ఆర్ ఆర్` అక్కడ ప్రకంపణలు సృష్టిస్తోంది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ కోసం ఇటు మెగా ఫ్యాన్స్ అటు నందమూరి ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇదిలా వుంటే తాజాగా ఎన్టీఆర్ అభిమానులు చేసిన ఓ పని ఇప్పడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకంగా ఓ థియేటర్ నే బుక్ చేసుకుని తమ కంట్రోల్ లో పెట్టుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అమెరికాలోని ఫ్లోరిడా కు చెందిన ఎన్టీఆర్ అభిమానులు కొంత మంది `ఆర్ ఆర్ ఆర్` ప్రిమియర్ షో కోసం ఏకంగా ఓ థియేటర్ నే బుక్ చేసుకున్నారు. ఫ్లోరిడాలోని టిన్ సెల్ టౌన్ లో సాయంత్రం 6 గంటల షో కోసం అన్ని టికెట్స్ ని ఎన్టీఆర్ అభిమానులు బుక్ చేసుకున్నారట.
ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగానూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోండె బెబ్బులి కొమరం భీం గానూ నటించిన విషయం తెలిసిందే.