Begin typing your search above and press return to search.
100 కోట్లు మించితేనే.. వంద డౌట్లు పెట్టిన GO
By: Tupaki Desk | 8 March 2022 4:37 AM GMT100 కోట్లు మించితేనే పెద్ద బడ్జెట్ సినిమా.. అలాంటి సినిమాలకు తొలి పది రోజులు టికెట్ పెంపు వర్తిస్తుంది! అంటూ కొత్త జీవోలో రూల్ ని పాస్ చేసింది ఏపీ ప్రభుత్వం. పైగా హీరో - దర్శకుల పారితోషికాలకు మినహాయింపును ఇచ్చింది. ఆ ఇరువురి పారితోషికాలు బడ్జెట్లో కలపరట. కలపకుండా వంద కోట్లు మించిన బడ్జెట్ తో సినిమా తీయాలని అంటున్నారు.
అయితే ఇది సహేతుకమైనదేనా? హేతుబద్ధమైనదేనా? పెద్ద సినిమాల బడ్జెట్లను ఎలా లెక్కిస్తారు? ఎవరు లెక్కిస్తారు? ఆడిటర్ ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి లెక్కలు కట్టిస్తుందా? అంటూ పంచ్ లు సెటైర్లు పడుతున్నాయి. అయినా సినిమా వాళ్ల నుంచి వాస్తవ లెక్కలు తెలుసుకోవడం అనేది కుదిరేపనేనా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరో సెక్షన్ నుంచి రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హీరో - దర్శకుల పారితోషికాన్ని బడ్జెట్ నుంచి ఎలా తొలగిస్తారు? వాళ్లకు ఇచ్చేవి డబ్బులు కావా? అది బడ్జెట్ కాదని అంటే తడిసిమోపెడవుతోంది తమకే కదా? అనేది నిర్మాతల అభిప్రాయం. పెద్ద హీరోకి వంద కోట్ల పారితోషికం ఇచ్చి 50 కోట్లలోనే సినిమాని తీసేస్తే అది చిన్న సినిమా ఎలా అవుతుంది? అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. 150కోట్లు పెట్టినట్టే కదా? అనేది వారి డౌట్. ప్రభాస్ లాంటి హీరో 100కోట్ల పారితోషికం తీసుకుంటుంటే.. చాలా మంది అగ్ర హీరోలు 50- 100 కోట్ల మధ్యలో తీసుకుంటున్నారు.
లాభాల్లో వాటాలు రాయించుకుంటున్నారు. మరి ఇలాంటి సన్నివేశంలో ఏ లెక్క ఎలా మారుతుందో అర్థం కాని గందరగోళం కనిపిస్తోంది. టికెట్ రేట్ల సవరణ జీవో కొందరికి మోదం కొందరికి ఖేదంగా కనిపిస్తోందన్న గుసగుస వినిపిస్తోంది. దీనిపై ఏదైనా ఆలోచించి సవరణ రూల్ ఏదైనా తయారు చేస్తారేమో చూడాలి.