Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ హీరోగా 'పెద్ది' లైన్ మీదికొచ్చినట్టే!
By: Tupaki Desk | 12 March 2022 10:36 AM GMTఎన్టీఆర్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ రోజు కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విడుదల కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన రంగంలోకి దిగబోతున్నాడు. సుడిగాలిలా ప్రమోషన్స్ ను చుట్టబెడుతూ, అన్ని భాషల్లోని ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకెళ్లనున్నాడు.
ఈ సినిమా తరువాత దాదాపు పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన కథలనే ఎంచుకుంటున్నాడు కూడా. తన తదుపరి సినిమాను ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమాకి తగిన లక్షణాలు పుష్కలంగా ఉన్న కథనే. కొరటాల మార్క్ వినోదంతో పాటు, సామాజిక సందేశంతో కూడిన కథనే. కొరటాల స్నేహితుడు .. కల్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అలీయా భట్ పేరు వినిపిస్తోంది.
ఇక మరో వైపున ఎన్టీఆర్ కి దర్శకుడు బుచ్చిబాబు కూడా ఒక కథను వినిపించాడు. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ. ఈ కథలో ఎన్టీఆర్ 'అథ్లెట్'గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు 'పెద్ది'.
దానినే టైటిల్ గా సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కథకి కూడా పాన్ ఇండియా స్థాయి స్కోప్ ఉంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో చేయడానికి మైత్రీ బ్యానర్ వారు రెడీగా ఉన్నారు. ఎన్టీఆర్ కి సుకుమార్ పై మంచి నమ్మకం ఉంది. ఈ కథను ఆయన ఓకే చేయడం వలన .. ఆయన శిష్యుడే బుచ్చిబాబు కావడం వలన ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమాను గురించి మైత్రీ మూవీ మేకర్స్ వారు అధికారిక ప్రకటన చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో అందరిలో ఉన్న సందేహం ఒకటే. కొరటాల సినిమా తరువాత బుచ్చిబాబు సినిమా చేస్తాడా? లేదంటే ముందుగా బుచ్చిబాబుతోనే సెట్స్ పైకి వెళతాడా? అని.
అయితే 'ఆర్ ఆర్ ఆర్' కోసం ఇప్పటికే ఎక్కువ కాలాన్ని కేటాయించిన ఎన్టీఆర్, ఇక తన సినిమాల విషయంలో ఎక్కువ గ్యాప్ రానీయకుండా చూసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ రెండు సినిమాలను ఒకే కాలంలో పూర్తిచేసేలా ఆయన తన షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు.