Begin typing your search above and press return to search.

పాయ‌ల్ .. ఆ బుంగ‌మూతి ఎందుక‌మ్మా?

By:  Tupaki Desk   |   18 Feb 2022 5:38 AM GMT
పాయ‌ల్ .. ఆ బుంగ‌మూతి ఎందుక‌మ్మా?
X
ఆర్.ఎక్స్ 100 చిత్రంతో పాయ‌ల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు పంజాబీలో పెద్ద స్టార్ గా పాపుల‌రైంది. ఓవైపు పంజాబీ చిత్రాల‌ను మ్యానేజ్ చేస్తూనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ప్రియుడు గౌర‌వ్ ధింగ్రాతో వ‌రుస ఫోటోషూట్లు చేసి ఇక్క‌డ ఆగ‌డాల‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసింది ఈ బ్యూటీ. ఒకానొక సంద‌ర్భంలో ప‌రిశ్ర‌మ‌లో వేధింపుల గురించి కూడా ఓపెనైంది పాయ‌ల్.

ప్ర‌స్తుతం సౌత్ లో వ‌రుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త‌న తాజా చిత్రం గోల్ మాల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యి గుమ్మ‌డికాయ కార్య‌క్ర‌మం జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా పాయ‌ల్ తాజా అప్ డేట్ చెప్పింది. అన్ని మంచి విష‌యాలు.. చివ‌రికిలా ముగిసాయి. మీ అంద‌రినీ ఎంత‌గా మిస్స‌వుతానో మాట‌ల్లో చెప్ప‌లేను అంటూ టీమ్ కి గుడ్ బాయ్ చెప్పేసింది.

గోల్ మాల్ సెట్లో త‌న‌తో ప‌ని చేసిన సాటి తార‌లు టెక్నీషియ‌న్లతో ర‌క‌ర‌కాల ఫోజులిచ్చింది. ఇక అమేజింగ్.. సూప‌ర్ ఆస‌మ్ అంటూ గోల్ మాల్ టీమ్ ని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తింది పాయ‌ల్ బేబీ. ఇక ముగింపు ఉత్స‌వంలో పాయ‌ల్ త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి ఇచ్చిన‌ బుంగ‌మూతి ఎక్స్ ప్రెష‌న్.. హైలైట్ గా నిలిచింది. అది ఫోటోల రూపంలో సోష‌ల్ మీడియాల్లో బ‌య‌ట‌ప‌డింది.

గోల్ మాల్ టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఇందులో కాస్టింగ్ కుదిరింది. ఇందులో ఆర్.బి. చౌద‌రి కుమారుడు రంగం ఫేం జీవా క‌థానాయ‌కుడు. ఇది భారీ బడ్జెట్ కామెడీ చిత్రం. పూర్తిగా మారిషస్ లో చిత్రీకరించారు. గతంలో అనేక విజయవంతమైన కన్నడ చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పొన్‌కుమరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి పొన్ కుమరన్ మాట్లాడుతూ.. గోల్ మాల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. హాస్య ప్ర‌ధానంగా సాగుతుంది. ఇది ప్రేక్షకులను థియేటర్ లకు ఆకర్షిస్తుంది.. అందరినీ సంతోషపరుస్తుంది.. అని అన్నారు.

జీవా - శివ జోడీ మంచి హాస్యాన్ని అందిస్తారని.. ఆ ఇద్ద‌రూ స్క్రీన్ పై క‌నిపించినంత సేపూ క‌డుపుబ్బా న‌వ్విస్తార‌ని.. విభిన్నమైన మ్యాజిక్ ను సృష్టించగలరని పొన్ కుమరన్ అన్నారు. పాయల్ రాజ్‌పుత్ - తాన్యా హోప్ ఇందులో కథానాయికలుగా నటించారు. జీవాతో న‌టిస్తున్న శివ మంచి పెర్ఫామ‌ర్. మిర్చి శివగా ప్రసిద్ధి చెందిన అత‌డు హాస్యనటుడు మరియు రేడియో జాకీ.

నవంబర్ లో షూటింగ్‌ ప్రారంభించి ఇప్ప‌టికి పూర్తి చేశారు. సినిమా 2022 ప్రథమార్థంలో విడుదలవుతుంది. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ S. శరవణన్- సంగీత స్వరకర్త అరుల్ దేవ్- ఎడిటర్ డాన్ బాస్కో- ఆర్ట్ డైరెక్టర్ శివ- గీత రచయితలు మధన్ కర్కి - వివేక - ఉన్నారు.