Begin typing your search above and press return to search.
డిజిటల్ లో 'పెళ్లిసందD' చేసేది ఎవరంటే..!
By: Tupaki Desk | 24 March 2022 11:30 AM GMTదర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చాలా కాలం తర్వాత పెళ్లిసందD సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో ఈ పెళ్లిసందD పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఈ సినిమా తో పరిచయం అయ్యాడు. శ్రీ లీలా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా నిరాశ పర్చింది.
టాక్ పరంగా ఈ సినిమా నిరాశ పర్చినా.. లిమిటెడ్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందడం వల్ల కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ ను సాధించినట్లుగా సమాచారం అందుతోంది. సినిమా కు నిర్మాత రాఘవేంద్ర రావు పెట్టిన మొత్తం వసూళ్ల రూపంలో వచ్చాయి. ఇక ఈ సినిమా ను డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మద్య కాలంలో సినిమా విడుదల అయిన మూడు నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
పెళ్లిసందD సినిమా మాత్రం వంద రోజులు పూర్తి అయినా కూడా ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ అవ్వలేదు. ఈ సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్నారు అంటూ ఆమద్య వార్తలు వచ్చాయి.
కాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు పెళ్లిసందD డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేయలేదు అంటూ తేల్చి చెప్పారు. దాంతో మళ్లీ కొన్నాళ్లుగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి చర్చ అక్కడక్కడ జరుగుతూనే ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ 5 వారు దక్కించుకున్నట్లుగా కొత్త వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఒక వేళ జీ 5 వారి వద్ద ఈ డిజిటల్ రైట్స్ ఉంటే వెంటనే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించే వారు. కాని ఇప్పటి వరకు వారు కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అప్ డేట్ ను ఇవ్వక పోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పెళ్లిసందD సినిమా స్ట్రీమింగ్ విషయంలో నెలకొన్న సస్పెన్స్ విషయమై రాఘవేంద్ర రావు లేదా ఆయన టీమ్ నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడం వల్లే ఏ ఓటీటీ వారు ఈ సినిమా ను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తుంది. వెండి తెరపై సక్సెస్ అవ్వకున్నా కూడా పెళ్లిసందD డిజిటల్ స్ట్రీమింగ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు.