Begin typing your search above and press return to search.

విధిరాత వల్లే ఇలా ఉన్నా.. పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్‌ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 March 2022 12:30 AM GMT
విధిరాత వల్లే ఇలా ఉన్నా.. పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్‌ వ్యాఖ్యలు
X
తెలుగు సినిమా పరిశ్రమలోకి ముకుంద మరియు ఒక లైలా సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక భారీ సినిమాలో నటించేందుకు వెళ్ళింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ టాలీవుడ్ లో అల్లు అర్జున్ కు జోడీగా దువ్వాడ జగన్నాధం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీజే సినిమా అనూహ్యంగా పూజ హెగ్డే ను స్టార్‌ గా చేసింది. ఆ సినిమాలో అందాల ఆరబోతతో పాటు ఆకట్టుకునే నటనతో కూడా మెప్పించిన పూజా హెగ్డే వెను దిరిగి చూసుకోకుండా సినిమాలను చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్.. కోలీవుడ్ అని మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. తమిళంలో ఈ అమ్మడు విజయ్ కి జోడిగా బీస్ట్‌ సినిమాలో నటించగా.. హిందీలో సల్మాన్ ఖాన్ కి జోడిగా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి పూజా హెగ్డే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన రాధేశ్యామ్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పూజా హెగ్డే వెల్లడించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాధేశ్యామ్‌ సినిమా జాతకాలు.. హస్త సాముద్రికం గురించి ఉంటుంది కదా.. మీరు జాతకాలను నమ్ముతారా.. విధిరాతను నమ్ముతారా అంటూ ప్రశ్నించగా పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను విధి రాతను నమ్ముతాను అంటూ తేల్చి చెప్పింది.

విధిరాత వల్లే తాను ఈ స్థితికి వచ్చానని కూడా చెప్పుకొచ్చింది. ఒక మధ్యతరగతికి చెందిన ఎడ్యుకేటెడ్‌ ఫ్యామిలీ నుండి తాను ఈ స్థితికి రావడం అనేది ఖచ్చితంగా విధే అయ్యి ఉంటుందని బలంగా నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చింది. ఎడ్యుకేటెడ్‌ ఫ్యామిలీ అయినా కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం ఏంటి.. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో వరుసగా పరాజయాలు ఎదురయినా కూడా హీరోయిన్ గానే ప్రయత్నాలు చేశాను.

నా విధి రాత ఇలా ఉండడం వల్ల ఆ సమయంలో ప్రయత్నాలు చేశాను. హీరోయిన్ గా చేయాలనే ఆసక్తి కోరిక ఎక్కువగా లేకుండానే తాను ఈ స్థాయికి చేరానంటే అది విధి రాత అని బలంగా నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రోత్సాహం లేకుండా తెలిసిన వాళ్లు లేకుండా ఈ స్థాయికి నేను చేరుకున్నాను అంటే అది నా అదృష్టం మరియు విధిరాత అని నేను నమ్ముతాను అంటూ పూజ హెగ్డే విధి రాత విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జీవితంలో కూడా ముందుకు నడిపించేది విధే. కనుక మనం ఆ విషయంలో నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు అంటూ వ్యాఖ్యలు చేసింది.