Begin typing your search above and press return to search.

వైరల్ ఫోటో: పూనమ్ కు పెళ్లి కుదిరిందా..??

By:  Tupaki Desk   |   14 Oct 2022 1:26 PM GMT
వైరల్ ఫోటో: పూనమ్ కు పెళ్లి కుదిరిందా..??
X
'మాయాజాలం' చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూనమ్ కౌర్.. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. గత కొంతకాలంగా వెండితెర మీద తక్కువగా కనిపిస్తున్న ఈ పంజాబీ బ్యూటీ.. ఇంటర్నెట్ లో తెగ సందడి చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూనమ్.. పేరుని ప్రస్తావించకుండా పరోక్షంగా పోస్టులు పెడుతూ.. నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తన దృష్టికి వచ్చిన విషయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వివాదాలు కొని తెచ్చుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

కర్వాచౌత్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ గురువారం రాత్రి పూనమ్ కౌర్ ఓ ఫొటో ని షేర్ చేసింది. ఇందులో ఆమె చేతిలో జల్లెడ పట్టుకుని చంద్రుడి వైపు చూసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు పూనమ్ కు పెళ్లైందా? లేదా పెళ్లి కుదిరిందా? అని కామెంట్స్ పెడుతున్నారు.

ఉత్తరాదిలో మహిళలు కర్వాచౌత్ వేడుకలను జరుపుకుంటారు. భర్త క్షేమాన్ని కోరుతూ పెళ్లైన మహిళలు పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం చేస్తారు. రాత్రి సమయంలో చంద్రుడి దర్శనంతోనే ఈ వేడుకలు పూర్తవుతాయి.

జల్లెడలో చంద్రుడిని చూసి ఆ వెంటనే భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే పెళ్లి కాని యువతులు కూడా ఈ పూజలు నిర్వహిస్తారు. కాబోయే భర్తతో కలిసి పూజలు చేసి.. అతని మొహాన్ని చూస్తారు. అలాంటిది ఇప్పుడు పూనమ్ కర్వాచౌత్ ఫోటోను షేర్ చేయడంపై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

చంద్రుడిని చూసిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని చూసారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీకు ఇదివరకే పెళ్లయిందా? లేదా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పూనమ్ ఫోటోపైనే చర్చ నడుస్తోంది.

ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. పూనమ్ కౌర్ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆశించిన మేర అవకాశాలు అందుకోలేకపోయింది. చేసిన సినిమాలు కూడా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కొంత విరామం తర్వాత చివరగా 'నాతి చరామి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ చిత్రం కూడా అమ్మడికి విజయాన్ని అందించలేకపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.