Begin typing your search above and press return to search.
ప్రభాస్ కోసం.. యువీ .. ఇది నిజమేనా?
By: Tupaki Desk | 12 March 2022 11:36 AM GMTపాన్ ఇండియా స్టాన్ ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. డెస్టినీకి - ప్రేమకు మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ చిత్రాన్ని చాలా కొత్త పంథాలో దర్శకుడు రాధాకృష్ణకుమార్ తెరకెక్కించారు. మార్చి 11న శుక్రవారం ఈ మూవీపై మిక్స్డ్ టాక్ వినిపించినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబట్టి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ మూవీలో ప్రభాస్ కనిపించిన తీరు, ఆయనని చూపించిన విధానం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోందట.
ఈ విషయంలో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంలో హీరో ప్రభాస్ ని చూపించిన విధానం ఏమంత బాగాలేదని, కొన్ని క్లోజప్ షాట్ లలో ఫేస్ లో గ్లో కనిపించడం లేదని, చాలా వరకు ఏజ్డ్ గా కనిపించాడని ఫ్యాన్స్ వాపోతున్నారట. ఈ విషయంలో తదుపరి చిత్రాల్లో అయనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మేకర్స్ కి సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారట.
అంతే కాకుండా లుక్ పరంగా ప్రభాస్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రభాస్ కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ మరింత అందంగా, యంగ్ గా కనిపించడం కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేశారని, సినిమా అంతా ప్రభాస్ ని సరికొత్త ప్రజెంట్ చేయడం కోసం టెక్నికల్ గా చాలా వర్క్ చేయించారట. డిజిటల్ పరంగా ప్రింట్ రీటచప్ చేశారట.
ఇందు కోసం సినిమాతో ప్రభాస్ కనిపించే ప్రతీ సన్నివేశం కోసం మేకర్స్ ఏకంగా 3. 5 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. ఇందు లో వున్న నిజమెంత అన్నది తెలియాల్సి వుంది. ఇది కేవలం ప్రచారమేనా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇదే నిజమైతే హీరో ప్రభాస్ కోసం మేకర్స్ ఖర్చు చేసింది చాలా పెద్ద మొత్తమేనని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ మూవీలో ప్రభాస్ షేప్ కూడా కొంత భిన్నంగా వుందని, పాండమిక్ కారణంగా అందులో మేకర్స్ మార్పులు చేయడానికి కుదరలేదని చెబుతున్నారు.
పైగా ఈ ప్రాజెక్ట్ దాదాపు మూడేళ్లు పట్టిందని, ఈ క్రమంలో హీరో ప్రభాస్ వెయిట్ పెరుగుతూ వచ్చారని, దాని వల్ల మేకర్స్ ఏమీ చేయలేకపోయారని అంటున్నారు. పాండమిక్ కారణంగా కొంత కాలం షూటింగ్ ఆగిపోవడంతో ప్రభాస్ బాడీలో మార్పులు వచ్చాయని, అంతే కాకుండా ఇటలీలో చేయాలనుకున్న సన్నివేశాలని చాలా వరకు హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లలో పూర్తి చేశారని, ఇందు కోసం భారీగానే వీఎఫ్ ఎక్స్ వాడారని అయితే ప్రభాస్ ఫేస్ విషయంలో మాత్రం పెద్దగా దృష్టిపెట్టలేదని ప్రచారం జరుగుతోంది.