Begin typing your search above and press return to search.
`లవ్ టుడే` డైరెక్టర్ కమ్ హీరో ఇలా ఫేమస్ అయ్యాడు!
By: Tupaki Desk | 27 Nov 2022 5:32 AM GMTకంటెంట్ ఉన్న సినిమాలకు కటౌట్ తో పనిలేదని నిరూపితమవుతోన్న రోజులివి. సినిమాలో విషయం ఉంటే? అదే సినిమాకి కోట్ల కనక వర్షం కురిపిస్తుంది. హీరో...హీరోయిన్లతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన `కాంతార` అలా సంచలనం రేపిన చిత్రమే. తాజాగా `లవ్ టుడే` అనే తమిళ సినిమా అక్కడ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
అంతా కొత్త వాళ్లతో తెరకెక్కించని సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా సక్సెస్ చూసి తమిళ ఇండస్ర్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇటీవలి కాలంలో కన్నడ..తెలుగు చిత్రాలు నమోదు చేస్తోన్న సక్సెస్ లు చూసి షాక్ అయింది. ఇప్పుడు లోకల్ ట్యాలెంట్ కి ఫిదా అవుతుంది. దీంతో లవ్ సినిమా రైట్స్ దక్కించుకుని దిల్ రాజు వెంటనే తెలుగులోనూ రిలీజ్ చేసారు.
ఇక్కడా సినిమా అదే దూకుడు చూపిస్తుంది. ఈసినిమాకి మెయిన్ స్ర్టీమ్ మీడియా సంస్థల్లో వచ్చిన రివ్యూలు చూసి నిజంగానే తెలుగు ఆడియన్స్ సైతం షాక్ అయ్యారు. సినిమాలో అంత విషయం ఉందా? అని సెర్చ్ చేస్తున్నారు. లవ్ టుడే సినిమాని ఈ రోజే చూసేయాలంటూ ఓ ఎగ్టైమ్ మెంట్ ని రివ్యూలు తీసుకొస్తున్నాయి. మరి ఇంతటి సక్సెస్ వెనుక ఉన్నది ఎవరు? అంటే నటుడు కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి అన్ని తానై చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `సెల్ ఫోన్ చుట్టూ తిరిగే కథ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యువతికి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఓసారి కథలోకి వెళ్తే... మన ఫోన్ వేరొకరికి ఇవ్వాలంటే చాలాసార్లు ఆలోచిస్తాం. అలాంటిది పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి-అబ్బాయి ఒకరి ఫోన్లు మరొకరు మార్చుకుంటే? ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ కథ పుట్టింది.
భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఇప్పుడు ఆదరణ పొందుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు అదే తీరున ఆదరిస్తున్నారు. 2017 లో నేను `అప్పాలాక్` అనే లఘు చిత్రం చేసాను. అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాన్ని మరింత విస్తృతం చేసి లవ్ టుడే కథసిద్దం చేసాను. నేను ఎవరి దగ్గర పనిచేయలేదు. ఎలాంటి సపోర్ట్ కూడా లేదు. నిర్మాణం గురించి ఆన్ లైన్ లో చూసి నేర్చుకున్నా.
ఏ కథ రాసినా అది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలన్నది నా లక్ష్యం. ఆదిశగానే పనిచేసేవాడిని. అవకాశం వస్తే తెలుగు..తమిళ్ లో సినిమాలు చేస్తానని తెలిపారు. మరి లవ్ టుడ్ సక్సెస్ చూసి బడా నిర్మాతలు ఎవరైనా ముందుకొస్తారామో చూడాలి. ఇటీవలి కాలంలో అల్లు అరవింద్..సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలు కొత్త వాళ్లని ప్రోత్సహించడంలో ముందుంటున్న సంగతి తెలిసిందే.