Begin typing your search above and press return to search.
ప్రియమణికి చిర్రెత్తుకొస్తే అంతే సంగతలు మరి!
By: Tupaki Desk | 12 April 2022 11:30 PM GMTబాడీ షేమింగ్ విషయంలో హీరోయిన్లు తరుచూ ట్రోలింగ్ గురవుతున్న సంగతి తెలిసిందే. బొద్దుగా ఉన్నా..బాగా సన్నజాజిలా మారిపోయినా హీరోయిన్లు ట్రోలర్లకి ఆహారంగా మారిపోయినట్లే. నెట్టింట ఓ రేంజ్ లో మీమ్స్..ట్రోలింగ్ తో ఆడుకుంటారు. ఈ విషయంలో ఏ హీరోయిన్ ని విడిచిపెట్టరు. స్టార్ హీరోయిన్ దగ్గర నుంచి మీడియం రేంజ్ నాయిక వరకూ అందరూ ట్రోలర్లకి టార్గెట్ అవుతారు. వీటిపై ఎవరి స్టైల్లో వారు ట్రోలర్లకి వార్నింగ్ లు జారీ చేస్తుంటారు.
తాజాగా ప్రియమణి బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయింది. "శరీరాకృతి ఎలా ఉన్నా దాన్ని స్వీకరించాలి. ప్లస్ సైజ్ లో ఉన్నా శరీరంపట్ల సానుకూలంగా ఉండాలి. నేను ఒకసారి లావుగా మారిపోతాను..మరోసారి సన్నజాజిలా మారిపోతాను.ఆ సమయంలో నాపైనా ట్రోలింగ్స్ వస్తుంటాయి. మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. వాటిని చూసి ఎంజాయ్ చేసేదాన్ని. ఓ కామన్ ఆడియన్ లా ఫీల్ అయ్యేదాన్ని. కానీ కొన్ని కొన్ని హద్దు మీరుతుంటాయి.
అలాంటప్పుడు వాటిని నేను సైతం జీర్ణించుకోలేకపోతాను. అలాంటప్పుడు ట్రోలింగ్ చేసే వాళ్లని కనిపెట్టి బ్లాక్ చేస్తాను. సోషల్ మీడియా ఒక్కటే జీవితం కాదు. అది ఓ పార్ట్ మాత్రమే. కొన్ని రకాల ప్రచారాలకు మాత్రమే దాన్ని వాడాలి. కానీ ఇటీవలి కాలంలో దుర్వినియోగ పరుస్తున్నారు. అభిమానులు నేను చెప్పాలనుకున్నది చెబుతాను. వాటిని అంగీకరించి స్వీకరిస్తే పర్వాలేదు. కొందరు పనిగట్టుకుని ట్రోల్ చేస్తారు. వారు చెప్పాలనుకున్నది చెప్పే రైట్ వారికుంటుంది.
కానీ అవి అవతలి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు. అందరం మనుషులమే. ప్రతీ ఒక్కరికి మనసు ఉంటుంది. దానికి గాయం చేసేలా కామెంట్లు ఉండకూడదని సూచించింది. నా పై వచ్చే మీమ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. వాటిని షేర్ చేసి నవ్వుకుంటాను. వాటిలో ఎక్కడైనా తేడా జరిగింది అనిపిస్తే వెంటనే గట్టిగా తిరిగి కౌంటర్ ఇస్తాను' అని తెలిపింది.
ఇంకా ఆరోగ్య సూక్తులు వల్లిస్తూ..."శరీరాకృతిని మార్చుకోవడానికి భారీ ఎక్సరసైజ్ లు అవసరం లేదు. సింపుల్ వర్కౌట్స్..యోగా లాంటి సాధనాలతో కొవ్వుని సులభంగా కరిగించవచ్చు. అందమైన రూపాన్ని తిరిగిపొందొచ్చు. లావుగా ఉన్నామనే భావన మనసులో నుంచి తొలగించి ఇష్టమైన పనిని ఒళ్లి అలిసేలా చేస్తే దానంతటదే కరిగిపోతుంది. ఇంట్లో డైలీ చేసే పనులు చేసినా మంచి ఫలితాలు" ఉంటాయి అని తెలిపింది.
ఇక ప్రియమణి కెరీర్ విషయానికి వస్తే నటిగా..బుల్లితెర హోస్ట్ గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నటి కన్నా బుల్లి తెరసపై హోస్ట్ గా బాగా ఫేమస్ అయింది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్..ఆర్యన్ భూమిక్..రుద్రనీల్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'మైదాన్' లో ప్రియమణి నటిస్తోంది. ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా భారీ అంచనాలే ఉన్నాయి.