Begin typing your search above and press return to search.
బన్నీ కోసం సుకుమార్ RRR ఫైట్!
By: Tupaki Desk | 15 Oct 2022 2:02 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `పుష్ప ది రైజ్`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించడమే కాకుండా ఊహించని విధంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ఉత్తరాది వారిని, బాలీవుడ్ వర్గాలని విస్మాయినికి గురిచేసింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ గా రానున్న `పుష్ప 2`పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు.
పారక్ట్ విషయంలో ప్రతీ విషయాన్ని ప్రత్యేకంగా చూస్తూ వస్తున్న సుకుమార్ ఈ సీక్వెల్ కోసం భారీ మార్పులతో పాటు బడ్జెట్ ని కూడా భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని దీపావళి తరువాత ప్రారంభించనున్నారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదిలా వుంటే ఈ మూవీ కోసం అల్లు అర్జున్ పై RRR ఫైట్ ని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేంటీ బన్నీ పై RRR ఫైట్ ఏంటీ? అని అంతా ఆరా తీస్తున్నారు. RRR లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ పులి ఫైట్ తో మొదలవుతుంది. ఈ ఫైట్ RRR లో వన్ ఆఫ్ ద హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇలాంటి ఫైట్ నే `పుష్ప 2` కోసం బన్నీపై సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ముందు దీపావళి తరువాత హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట సుకుమార్.
ఆ తరువాత థాయ్ లాండ్ లో బన్నీపై పులి ఫైట్ ని టెర్రిఫిక్ యాక్షన్ ఎపిసోడ్ గా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇది ఈ మూవీకి మెయిన్ హైలైట్ గా నిలవనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం కీలక ఘట్టాల చిత్రీకరణని విదేశాల్లో చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వినిపిస్తునప్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే థాయ్ లాండ్ అడవుల్లో బన్నీపై పులి ఫైట్ ని ఓ రేంజ్ లో చిత్రీకరించాలని సుకుమార్ భారీగా ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.