Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్ : టైటానిక్ ఎందుకులే భయ్యా..!
By: Tupaki Desk | 4 March 2022 12:30 AM GMTప్రభాస్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదలకు ముంగిట నిలిచింది. సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా థర్డ్ వేవ్ కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేశారు. మరీ ఆలస్యం చేయకుండా మార్చి లో విడుదలకు తేదీ ఖరారు చేయడం.. ఆ విడుదల తేదీ దగ్గరకు రావడం కూడా జరిగి పోయింది. ఈ సినిమా గురించి మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదంటూనే ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని ఆకట్టుకునే సినిమా అంటున్నారు.
ఇది ఒక అందమైన ప్రేమ దృశ్య కావ్యం గా అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యి నాలుగు ఏళ్లు కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా గురించి కొన్ని వందలు కాదు.. వేలకు పైగా న్యూస్ పుకార్లు పుట్టుకు వచ్చాయి. ప్రతి వార్త.. ప్రతి పుకారు కూడా సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచాయి. ఆ అంచనాలు చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా టైటానిక్ సినిమా తో ఈ సినిమా కు పోలిక అంటున్నారట.
టైటానిక్ సినిమాలో ఎలా అయితే క్లైమాక్స్ లో అతి భారీ నౌక నీటిలో మునిగి పోతుందో అలాగే ఈ సినిమా లో కూడా ఒక భారీ నౌకను చూపించబోతున్నారు. పోస్టర్స్ మరియు ట్రైలర్స్ లో ఆ విషయాన్ని ఇప్పటికే రివీల్ చేశారు. టైటానిక్ ను మించిన అద్బుతమైన లవ్ స్టోరీ ఇప్పటి వరకు రాలేదు.. ముందు ముందు రాదని టైటానిక్ అభిమానుల బలమైన నమ్మకం. కాని ఇప్పుడు రాధేశ్యామ్ ఆ స్థాయి అంటూ కొందరు ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ కు అద్బుతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను టైటానిక్ వంటి సినిమా తో పోల్చి మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. మరీ ఎక్కువ క్రేజ్ పెంచినట్లయితే ప్రేక్షకులు కాస్త తగ్గినా కూడా తీవ్రంగా నిరాశ పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా అంచనాలు ఈ స్థాయిలో ఉంచితే చాలు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాధేశ్యామ్ సినిమా లో ఉన్న లవ్ స్టోరీ ఒక అందమైన పెయింటింగ్ మాదిరిగా ఉంటుంది అంటూ చెబుతూ వస్తున్నారు. టైటానిక్ సినిమాలో కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు.. కడుపు నొప్పించే కామెడీ సన్నివేశాలు ఉండవు. అచ్చు రాధేశ్యామ్ లో కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు కాని.. కామెడీ సన్నివేశాలు కాని ఉండవు అని మొదటి నుండే మేకర్స్ చెబుతున్నారు.
కాని ప్రేమ కోసం ఒక యుద్దమే జరుగుతుందని అంటున్నారు. సినిమాకు యాంటీ క్లైమాక్స్ ఉంటుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కాని తాజాగా దర్శకుడు ఒకటికి రెండు సార్లు బల్లగుద్ది మరీ చెప్పాడు. సినిమాలో యాంటీ క్లైమాక్స్ ఉండదు అని. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. టైటానిక్ లో యాంటీ క్లైమాక్స్ ఉంటుంది. కాని రాధేశ్యామ్ లో యాంటీ క్లైమాక్స్ లేదని క్లారిటీ ఇచ్చాడు. కనుక ఆ కొందరు రాధేశ్యామ్ ను టైటానిక్ తో పోల్చడం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత అభిమానులు ప్రేక్షకులు అలా ఫీల్ అవుతారేమో చూడాలి.