Begin typing your search above and press return to search.
యాంగ్రీ మ్యాన్ తప్పుకున్నారా? తప్పించారా?
By: Tupaki Desk | 15 Feb 2022 9:30 AM GMTఒకప్పుడు యాంగ్రీమ్యాన్ గా ప్రేక్షకులను అలరించిన సీనియర్ హీరో రాజశేఖర్.. ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 'కల్కి' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతూ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో మ్యాచో స్టార్ గోపీచంద్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వచ్చాయి.
'ధృవ' సినిమాలో అరవింద్ స్వామి తరహా ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి రెడీ అన్నట్లు రాజశేఖర్ ఆ మధ్య హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీలో విలన్ రోల్ కోసం మేకర్స్ రాజశేఖర్ ని సంప్రదించారని టాక్ వచ్చింది. ఆయనకి పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేసారని చెప్పుకున్నారు. అయితే ఉన్నట్లుండి చిత్ర బృందం జగపతిబాబుని ప్రతినాయకుడిగా ప్రకటించారు.
దీంతో రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా? లేదా మేకర్స్ తప్పించారా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్ దగ్గర పేచీ రావడంతో యాంగ్రీమ్యాన్ ఈ సినిమా చేయలేదని ఇప్పుడు టాక్ వచ్చింది. ఈ క్యారెక్టర్ కోసం రాజశేఖర్ రూ.5 కోట్లు వరకు డిమాండ్ చేశారట. సీనియర్ హీరో ఉంటే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ రూ.4 కోట్ల వరకూ ఇవ్వడానికి సిద్దమయ్యారట.
కానీ రాజశేఖర్ దీనికి అంగీకరించకపోవడంతో.. నిర్మాతలు మరో సీనియర్ నటుడు జగపతిబాబుని ఫైనలైజ్ చేసుకున్నారని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. నిజంగానే రాజశేఖర్ కి పారితోషికం నచ్చక సినిమా చేయలేదా? లేదంటే 'నో' చెప్పడం ఇష్టం లేక ఇలా కోటి రూపాయల దగ్గర బేరమాడారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే రాజశేఖర్ ఇప్పుడు సోలోగా పలు ఆసక్తికరమైన సినిమాలు చేస్తున్నారు. సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'శేఖర్' రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘గతం’ ఫేమ్ కిరణ్ కొండమడుగలతో '#RS92' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ యాక్షన్ థ్రిల్లర్ ని అనౌన్స్ చేసారు. ఇదే క్రమంలో 'కేరాఫ్ కంచరపాలెం' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహాతో యాంగ్రీ హీరో 'మర్మాణువు' అనే మూవీలో నటిస్తున్నారు.