Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్'లో పూణే పిల్ల ఎలా ఛాన్స్ కొట్టేసిందబ్బా?!

By:  Tupaki Desk   |   7 March 2022 8:30 AM GMT
రాధేశ్యామ్లో పూణే పిల్ల ఎలా ఛాన్స్ కొట్టేసిందబ్బా?!
X
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ .. ఆయన సినిమాలో అవకాశం కోసం స్టార్ హీరోయిన్స్ పోటీపడుతుంటారు. ఆయన సినిమాలో ఒక చిన్న రోల్ చేసినా చాలు .. మంచి గుర్తింపు వస్తుందని చాలామంది ఆర్టిస్టులు భావిస్తుంటారు. అలాంటి ఒక అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. పాన్ ఇండియా సినిమాల్లో ఏ చిన్న పాత్ర అయినా జనానికి బాగా తెలిసిన ఆర్టిస్టునే పెడదామని మేకర్స్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయి బడ్జెట్ సినిమాలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా చూసుకుంటూ ఉంటాయి.

అలాంటి ఒక పాన్ ఇండియా సినిమాలో ఒక చిన్న హీరోయిన్ కి ఛాన్స్ తగిలితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదెలా సాధ్యమబ్బా అంటూ షాక్ అయ్యేలా చేస్తుంది. 'రాధే శ్యామ్' సినిమాలో హీరోయిన్ రిద్ధి కుమార్ కు ఛాన్స్ తగలడం ఇప్పుడు అలాంటి ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది. రిద్ధి కుమార్ పూణే పిల్ల .. మోడలింగ్ నుంచి సినిమాల వైపు వచ్చిన బ్యూటీ. అయితే ఆమె పేరు జనాలకి పెద్దగా తెలియదు. ఎందుకంటే ఆమె తన కెరియర్ ను మొదలుపెట్టేసి ఎక్కువ కాలం కాలేదు .. ఏ భాషలోనూ ఎక్కువ సినిమాలు చేయలేదు.

తెలుగులో ఆమె రాజ్ తరుణ్ జోడీగా 'లవర్' చేసింది. ఆ సినిమా ఎప్పుడు థియేటర్స్ కి వచ్చి ఎప్పుడు వెళ్లిపోయిందనేది ఎవరికీ తెలియదు. అలాంటి ఒక అమ్మాయికి 'రాధే శ్యామ్' సినిమాలో ఛాన్స్ రావడమనేది అంత తేలికగా జరిగే విషయం కాదు. 'రాధేశ్యామ్' సినిమాలో ఆమె చేసిన విషయం కూడా ఇప్పుడు ఆమె చెబుతున్నంత వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. ప్రభాస్ తో కలిసి నటించడం చాలా గొప్పగా అనిపించిందని చెబుతూ, ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో తాను 'తార' పాత్రను పోషించాననీ, కథలో తన పాత్ర చాలా కీలకమైనదిగా కనిపిస్తుందంటూ మరింతగా జనంలోకి వెళ్లింది.

చూడటానికి చిట్టి చామంతి పువ్వులా అమ్మాయి బాగానే ఉంది .. అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో తనదైన దూకుడు చూపిస్తూ, చానల్స్ లోను .. వెబ్ సైట్స్ లోను సందడి చేస్తోంది. ఈ బ్యూటీ మాటలు వింటుంటే మాత్రం ఈ సినిమాలో ఏదో గట్టి పాత్రనే చేసినట్టుగా అనిపిస్తోంది.

అదేమిటనేది ఆ సినిమా చూస్తేనే గాని తెలియదు. ఈ పాన్ ఇండియా సినిమాలో ఈ అమ్మాయికి ఛాన్స్ ఎలా తగిలిందనేదే ఇప్పుడు అందరి బుర్రలను తొలిచేస్తున్న ప్రశ్న. ఈ సినిమా తరువాత అమ్మడి జాతకం మారిపోతుందేమో చూడాలి మరి!