Begin typing your search above and press return to search.
యూఎస్ లో ఫ్యాన్స్ వారు అలా ఉంటే ఇక్కడ పరిస్థితి ఏంటో?
By: Tupaki Desk | 10 March 2022 8:53 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ను మార్చి 25 న విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఇప్పటికే యూఎస్ తో పాటు పలు ప్రపంచ దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యింది.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు అవుతాయనే నమ్మకం ఇప్పటికే ఉంది. తాజాగా వస్తున్న అడ్వాన్స్ బుకింగ్ ను చూస్తుంటే రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా అని మరింత నమ్మకం కలుగుతుంది.
సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలకు పైగానే ఉంది. ఇప్పటికే యూఎస్ లో దాదాపుగా మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో యూఎస్ లో విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది.
అక్కడ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు పోటీ పడి మరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉన్నారు.
యూఎస్ లో ఎన్టీఆర్ అభిమానులు మెజార్టీ టికెట్లను ఇప్పటి వరకు కొనుగోలు చేయడం జరిగిందని తెలుస్తోంది. వారు అత్యధికంగా ప్రత్యేక షో లకు ఏర్పాట్లు చేస్తున్నారని కూడా సమాచారం అందుతోంది. ఇప్పటి వుకు ఎన్టీఆర్ అభిమానుల డామినేషన్ కొనసాగడంతో మెగా అభిమానులు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో చరణ్ అభిమానులు అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి నటించిన సినిమా అయినా కూడా ఇద్దరు హీరోల అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ విషయంలో పడుతున్న పోటీని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. యూఎస్ లోనే పరిస్థితి అలా ఉంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ మొదలు అయ్యింది. బి మరియు సి ఏరియాల్లో థియేటర్ల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
థియేటర్ల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు మొదలుకుని ఇంట్రడక్షన్ సన్నివేశాల వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్య పోటీ వాతావరణం కనిపించే అవకాశం ఉంది. అదే జరిగితే ఖచ్చితంగా రెండు వర్గాల మద్య వైరం తరహాలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మద్య పోటీ తరహా యుద్దం తప్పదేమో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగబోతుంది అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.