Begin typing your search above and press return to search.
#RRR మ్యూజిక్ ఆల్బమ్ పై జనం వ్యూ ఇదీ
By: Tupaki Desk | 15 March 2022 5:30 AM GMTనాలుగు దశాబ్ధాల కెరీర్ లో ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించారు మరకతమణి ఎం.ఎం.కీరవాణి. మ్యూజిక్ కి స్కోప్ ఉన్న ఏ చిత్రానికి అయినా ఆయన పని తీరు అద్భుతంగా ఉంటుంది.
ఇంతకుముందు బాహుబలి కోసం అద్భుతమైన పాటల్ని సృజించిన ఎం.ఎం.కీరవాణి మళ్లీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో ఆ మ్యాజిక్ చేయలేకపోయారన్నది తాజా గుసగు.
RRR నిర్మాతలు కొద్దిసేపటి క్రితం కొత్త ప్రమోషనల్ సాంగ్ `ఎత్తర జెండా`ను విడుదల చేసారు. ఇది సినిమా ఆల్బమ్ నుండి చివరి ఆడియో సాంగ్ అని భావిస్తున్నారు. అయితే జనాల టాక్ ప్రకారం.. RRR ఆడియో యావరేజ్. నాటు నాటు తప్ప మిగతా పాటలేవీ సోషల్ మీడియాలో వైరల్ గా మారలేదు. నాటు నాటు క్రెడిట్ కూడా పూర్తిగా రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ ల ఎనర్జిటిక్ డ్యాన్సులకు ఇవ్వాలి. తాజాగా విడుదలైన ఎత్తర జెండా సాంగ్ కూడా ట్విట్టర్ ప్రేక్షకుల నుండి సాధారణ ప్రతిస్పందనను పొందింది.
వ్యూవర్ షిప్ చాలా వీక్ గా ఉంది. అన్నట్టు RRR అనేది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాబట్టి చార్ట్ బస్టర్ ఆడియో ఆల్బమ్ కి ఎక్కువ స్కోప్ లేదని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం ఎం.ఎం. కీరవాణి ఇంకా బెటర్ సంగీతాన్ని అందించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కీరవాణి RRR ట్రైలర్ కోసం అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అతను రాజమౌళి చిత్రాలకు అత్యుత్తమ మ్యూజిక్ ని ఇవ్వడం ద్వారా పాపులరయ్యాడు. అభిమానులు ఇప్పుడు అతను RRR కోసం అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తారని ఆశిస్తున్నారు. అసాధారణమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లతో కీరవాణి సామర్థ్యంపై అనుమానం ఉన్న ఎవరైనా అతని మునుపటి పనిని చూడాలి.
అంతేకాదు ఆడియో యావరేజ్ అయితే ఇతర విభాగాల్లో బలంగా ప్రయత్నించాలి. RRR కోసం చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాల్సిన బాధ్యత ఇప్పుడు కీరవాణిపై ఉంది. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రానికి మ్యూజిక్ హాలీవుడ్ ప్రమాణాల్ని అందుకోవాల్సి ఉంటుంది.
బాహుబలి సమయంలో వచ్చిన విమర్శలు కూడా ఇప్పుడు వినిపించకూడదని అభిమానులు భావిస్తున్నారు.