Begin typing your search above and press return to search.

RRR పోస్ట్ ఇంట‌ర్వెల్ బ్లాక్ కేక‌లేనా?

By:  Tupaki Desk   |   18 March 2022 7:33 AM GMT
RRR పోస్ట్ ఇంట‌ర్వెల్ బ్లాక్ కేక‌లేనా?
X
యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మూవీ 'ఆర్ ఆర్ ఆర్‌'. గ‌త కొంత కాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్నఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. రిలీజ్ మ‌రి కొన్ని రోజులే మిగిలి వుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌చారాన్ని హోరేత్తిస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు నుంచే రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీంల ఫిక్ష‌న‌ల్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్ప‌టికే ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగానూ స‌రికొత్త రికార్డు లు న‌మోదు చేసింది.

అంతే కాక‌కుండా యుఎస్ ప్రీమియ‌ర్స్ ప‌రంగానూ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలో వ‌న్ మిలియ‌న్ దాటేసి ఓవ‌ర్సీస్ లో అది కూడా యుఎస్ లో చ‌రిత్ర సృష్టించింది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన ఓ అప్ డేట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చేసి ఫ్యాన్స్ ని, సినీ ల‌వ‌ర్స్ ని స‌ర్ ప్రైజ్ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్న హీరోలు, డైరెక్ట‌ర్ సినిమాపై మ‌రింత హైప్ ని క్రేయేట్ చేస్తున్నారు.

ప‌లు మీడియా సంస్థ‌ల‌కు బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నా రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన కీలక విష‌యాల్ని వెల్ల‌డిస్తూ స‌ర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇంట‌ర్వెల్ బ్లాక్ కి ముందు వ‌చ్చే స‌న్నివేశాల‌కు సంబంధించిన కీల‌క హింట్ ని బ‌య‌ట‌పెట్టేశారు. పోస్ట్ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు రోమాంచితంగా వుంటాయిని ఓ విధంగా చెప్పాలంటే అదొక ఆట‌మ్ బాంబ్ లా పేలుతుంద‌ని సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తుంద‌ని చెప్పుకొచ్చారు. అంటే ఈ సీన్ కి థియేట‌ర్లు మోత మోగిపోవ‌డం ఖాయ‌మ‌ని, ఫ్యాన్స్ కిక కేక‌లే అన్నామ‌ట‌.

దీనికి సంబంధించిన ఎంటైర్ ఎపిసోడ్ సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తుంద‌ని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేశారు. హై వోల్టేజ్ యాక్ష‌న్ ప్యాక్డ్ ఎపిసోడ్ గా దీన్ని రాజ‌మౌళి అభివర్ణించారు. దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్న సినీ ల‌వ‌ర్స్‌, అభిమాన‌ల్లో మ‌రింత క్యురియాసిటీ స్టార్ట‌యింది. ట్రైల‌ర్ లో చూపించిన స‌న్నివేశాల‌కు మించి సినిమాలో స‌ర్ ప్రైజ్ లు వుండ‌బోతున్నాయ‌ని తాజాగా రాజ‌మౌళి వెల్ల‌డించిన వీడియో ద్వారా స్ప‌ష్ట‌మౌతోంది.

స‌ర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో విజువ‌ల్ ఫీస్ట్ గా 'ఆర్ ఆర్ ఆర్‌' వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్యంత భారీ సినిమాగా రానున్న ఈమూవీ తాజాగా మ‌రో రికార్డుని సొంతం చేసుకుంది. బుక్ మై షోలో త్వ‌ర‌లోనే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

అయితే ఈ మూవీ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నార‌ని ఓ కాంటెస్ట్ ని నిర్వ‌హించింది. దీనికి వ‌న్ మిలియ‌న్ కు మించి ఆస‌క్తిగా వున్నామ‌ని చెప్ప‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తాజాగా నిర్వ‌హించిన ఈ కాంటెస్ట్ సినిమా పై దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్లో వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుండ‌టం విశేషం.