Begin typing your search above and press return to search.
డాల్బీ సౌండ్స్ తో #RRR థియేటర్లు దడదడ
By: Tupaki Desk | 13 March 2022 8:51 AM GMT#RRR దడ పుట్టించేందుకు వస్తోంది. 25 మార్చి ముహూర్తం. థియేటర్లలో వీక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాలో లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లను రాజమౌళి ఏ రేంజులో ఎలివేట్ చేశారో చూడాలని ఒక వర్గం ఇంకా ఎక్కువ ఆసక్తిగా ఉంది. బాహుబలి గ్లింప్స్ ని మించి ఇంకేదైనా మ్యాజిక్ చేస్తారన్న ఉత్కంఠ అందరిలో ఉంది.
ఇందులో దేశభక్తికి అదనంగా యాక్షన్ డ్రామా సెంటిమెంట్ రొమాన్స్ ఇలా ప్రతిదీ దేనికదే ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఫుల్ మీల్స్ లాంటి సినిమాని రాజమౌళి అందిస్తున్నారని ఇప్పటికే ట్రైలర్ వెల్లడించింది. దేశంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని రాజమౌళి అందిస్తున్నారు. #RRR దేశంలోనే తొలి డాల్బీ సినిమా అంటూ తాజాగా చిత్రబృందం ప్రకటించింది.
ఫరాస్ ఫిలిమ్స్ .. సారిగమ సినిమాస్ - రాఫ్తార్ క్రియేషన్స్ వంటివి కొన్ని విదేశీ ఏరియాల్లో విడుదల చేస్తున్నాయి.
చాలా డైలమాల తర్వాతా హైప్..!
ఈ చిత్రాన్ని నిర్మాతలు 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అనేక వాయిదాల తర్వాత ఈ తేదీని నిర్ణయించాక అభిమానుల్లో చర్చ సాగింది. అయితే ఇప్పుడు పరీక్షల సీజన్ ఒకవైపు ఐపీఎల్ సీజన్ మరోవైపు హీట్ పుట్టిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ప్రతియేటా ఏప్రిల్ మాసం పబ్లిక్ పరీక్షలతో సంక్లిష్టమైనది. ఆ తర్వాతే సెలవులు ఉంటాయి. మార్చి -ఏప్రిల్ లను పరీక్షా సీజన్ లుగా పరిగణిస్తారు.
అందువల్ల చాలా పెద్ద సినిమాలు ఆ సమయంలో విడుదల కావు. ఈ సంవత్సరం ప్రతిదీ క్లిష్టంగా మారింది. ఇప్పటికే కరోనా మూడవ వేవ్ భయాలు వైదొలగడం ప్లస్ అయినా కానీ పరీక్షల సీజన్ కావడం కొంత ఇబ్బందికరం. మార్చి- ఏప్రిల్ లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. పైగా మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈసారి 10 జట్లు ఆడతాయి. టోర్నమెంట్ చాలా పెద్దదిగా మారింది. అది RRR కలెక్షన్లను కొంత ప్రభావితం చేయవచ్చు. ఇవన్నీ అవరోధాలుగా మారినా కానీ మూవీకి ఉన్న హైప్ ఎంత మాత్రం తగ్గడం లేదు. అన్నిటినీ అధిగమించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.
మరోవైపు ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్లకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం కొంతవరకూ మేలు చేసింది. ఏపీలో టిక్కెట్టు రేట్లు పెరగడం పెద్ద ఊరట. ఆర్.ఆర్.ఆర్ కి అదనపు షోలకు అవకాశం కల్పిస్తారా లేదా? అన్నది కూడా కాస్త వేచి చూడాలి. ఇక ఐదో ఆటకు ఏపీ ప్రభుత్వం అనుమతినివ్వడం మరో పెద్ద ప్లస్. ప్రస్తుత టిక్కెట్ రేట్లతో ఏపీలో పంపిణీ వర్గాలకు కొంతవరకూ ధైర్యం వచ్చిందన్న గుసగుసా వినిపిస్తోంది.