Begin typing your search above and press return to search.
ప్రభాస్ `సలార్` ఫుల్ మీల్స్ ట్రీట్
By: Tupaki Desk | 13 March 2022 2:30 PM GMTడార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు సినిమాల షెడ్యూళ్లను అతడు మ్యానేజ్ చేస్తున్నాడు. ఓవైపు ఆదిపురుష్ 3డి మరోవైపు సలార్ చిత్రాలతో బిజీ అయిన ప్రభాస్ ఇంతలోనే నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చిత్రీకరణలోనూ పాల్గొంటున్నారు. ఆదిపురుష్ 3డి చిత్రీకరణ పూర్తి కాగా.. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. సలార్ చిత్రీకరణ మెజారిటీ పార్ట్ పూర్తయింది. నాగ్ అశ్విన్ తో షూటింగ్ జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఈ మూడు సినిమాల్లో ఏ మూవీ కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు? అంటే.. దేనికదే ప్రత్యేకం. కానీ కేజీఎఫ్ దర్శకుడి నుంచి వస్తున్న సలార్ పై ఎంతో క్రేజ్ ఉంది. పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్ కలయికలో వస్తున్న సినిమాగా సలార్ సంచలనాలు మరో లెవల్లో ఉంటాయని భావిస్తున్నారు.
సలార్ ప్రత్యేకత ప్రభాస్ అభిమానులకు.. మాస్ ఆడియెన్ కి ఫుల్ మీల్స్ ట్రీటిస్తుందని అంచనా. ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులు చాలా కాలంగా ప్రభాస్ నుంచి వేచి చూస్తున్న జానర్ ఇదే. ఆగస్టులో రానున్న ఈ చిత్రం ఆదిపురుష్ 3డి కంటే విభిన్నమైనది.
ఇకపోతే ప్రభాస్ ఎంపికలు దేనికదే యూనిక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సలార్ మాస్ యాక్షన్ కంటెంట్ తో మాఫియా నేపథ్యంలో సాగనుండగా.. ఆదిపురుష్ 3డి పురాణ పురుషుడు శ్రీరాముడి కథతో రూపొందడం ఉత్కంఠ పెంచేదిగా ఉంది. వీటన్నిటికీ భిన్నంగా నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇవన్నీ పాన్ ఇండియా కంటెంట్ తో రూపొందుతున్నవి. ప్రభాస్ ని మరో లెవల్లో నిలబెడతాయని అంచనా.
పవర్ హౌస్ గా మారిన సలార్
డార్లింగ్ ప్రభాస్ తో నువ్వా నేనా? అంటూ ఢీ కొట్టేందుకు పలు భాషల నుంచి టాప్ స్టార్లను ఎంపిక చేసుకున్నారు ప్రశాంత్ నీల్.
ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి మాలీవుడ్ ట్యాలెంట్ ని యాడప్ చేసి రేంజును అమాంతం పెంచేసారు. పృథ్వీరాజ్ మాలీవుడ్ లో ఆల్ రౌండర్ గా వెలిగిపోతున్నాడు. హీరోగా రచయితగా దర్శకుడిగా అతడి ప్రజ్ఞా పాటవాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
అతడు నటించిన చాలా సినిమాలు తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి. ఇంతకుముందు `లూసీఫీర్` లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి దర్శకత్వం వహించారు. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్ ఒక కీలక పాత్రను పోషించడమే గాక దర్శకుడిగానూ సత్తా చాటారు.
మోహన్ లాల్ నటించిన `బ్రో డాడీ` చిత్రానికి కూడా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించగా.. అందులో అతడు ఓ కీలకపాత్రను కూడా పోషించాడు. అయితే ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పాత్ర ఎలా ఉంటుంది? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. అతడు కేవలం అతిథి పాత్రలో కనిపిస్తాడా లేక పూర్తి స్థాయి కీలక పాత్రనే చేస్తున్నాడా? అన్నది చూడాలి.