Begin typing your search above and press return to search.
కాస్మిక్ రే-లా కంటిని చీల్చిన సామ్ లుక్
By: Tupaki Desk | 1 April 2022 4:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ -రామ్ చరణ్ - అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్లుగా పాపులరయ్యారు. కథానాయికల్లో పాన్ ఇండియా స్టార్ డమ్ ఎవరికి ఉంది? అంటే.. కచ్ఛితంగా అందాల సమంత పేరు వినిపిస్తోంది. ఫ్యామిలీమ్యాన్ - సీజన్ 2తో సమంతకు అంతటి పాపులారిటీ దక్కింది. మజిలీ- ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్లకు సమంత ప్రధాన కారణమన్నది క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ లో ఎల్.టి.టి.ఇ తీవ్రవాది రాజీ పాత్ర అంతకుమించి అన్న టాక్ వచ్చింది.
ఇటీవల వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల అనంతరం సమంత పూర్తిగా తన కెరీర్ పైనే దృష్టి సారించింది. సమంత పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్‌ని పొందడంపై ఆసక్తిని కనబరుస్తోంది. ఇటు తెలుగు-తమిళ చిత్రాలతో పాటు హిందీలోనూ నటించేందుకు స్పీడ్ పెంచింది.
తెలుగు చిత్రాలతో పాటు రెండు హిందీ వెబ్ సిరీస్ లకు సంతకం చేసింది. అలాగే తాప్సీ నిర్మించే భారీ చిత్రాల్లో సమంత నటించనుంది. బాలీవుడ్ పెద్ద ప్రాజెక్ట్ ఏమిటన్నది సమంత ప్రకటించాల్సి ఉంది.
మరో కోణంలో చూస్తే సమంత అల్ట్రా ఫ్యాషనిస్టాగా గుబులు రేపుతోంది. ఇటీవల ఊ అంటావా .. సాంగ్ తర్వాత సామ్ పూర్తిగా తనలోని గ్లామర్ యాంగిల్ ని ఎలివేట్ చేసేందుకు మరింత ఆసక్తిగా ఉంది. క్రమం తప్పకుండా ఫ్యాషన్ మ్యాగజైన్ ల కవర్ పేజీలపైనా దర్శనమిస్తోంది.
తాజాగా కాస్మోపాలిటన్ కవర్ పేజీపై అద్భుతమైన లుక్ తో ఆకట్టుకుంది. ఫ్యాషన్ మ్యాగజైన్ డిజిటల్ వెర్షన్ లుక్ ఇది. సామ్ మైండ్ బ్లాంక్ చేసే ఫోజులతో అదరగొట్టింది. అరక్షణం తనని కళ్లార్పకుండా చూడాల్సిందే అన్నంత బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఈ భంగిమలో సమంత ఒక్క సారిగా అగ్గి రాజేసిందని చెప్పాలి.
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం విడుదల కావాల్సి ఉంది. తదుపరి ఓబేబి నిర్మాతలతో హాలీవుడ్ సినిమా చేయనుంది. తెలుగులో విజయ్ దేవరకొండతో సమంత ఓ సినిమా చేస్తోంది. తదుపరి ఓ బాలీవుడ్ భారీ చిత్రాన్ని ప్రకటించనుందనే గుసగుసా వినిపిస్తోంది. ముంబైలో ప్రముఖ దర్శకనిర్మాతలతో చర్చల్లో ఉందన్న టాక్ ప్రముఖంగా తెలుగు ఫిల్మీ సర్కిల్స్ వైరల్ గా మారింది.