Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఇందుకు రాజమౌళి నూరు శాతం అర్హుడు.. కాదనగలరా?

By:  Tupaki Desk   |   23 March 2022 5:40 AM GMT
ఫోటోటాక్ : ఇందుకు రాజమౌళి నూరు శాతం అర్హుడు.. కాదనగలరా?
X
మాస్ హీరోలకు పదుల ఫీట్ల కటౌట్ లను నిర్మించే తెలుగు రాష్ట్రాల్లో దర్శకుల కటౌట్స్ ను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. హీరోల కటౌట్స్ చాలా కామన్.. హీరోయిన్స్ కటౌట్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.. కాని దర్శకుల కటౌట్స్ ఏంటీ అనేది మొన్నటి వరకు ఒక అనుమానం. కాని ఇప్పుడు రాజమౌళి ఈ కటౌట్ ను చూస్తే అవసరమా అని ఏ ఒక్కరు అనలేరు.. ఆయన ఈ కటౌట్‌ కి నూరు శాతం అర్హుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఆ విషయాన్ని ఏ ఒక్కరు కూడా కదు అనలేరు.

హీరోలను మాస్‌ గా చూపించేది దర్శకులే. కాని వారికి హీరోల తర్వాతే గుర్తింపు వస్తుంది. ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విషయంలో మాత్రం ఇద్దరు హీరోలను మించిన క్రేజ్ రాజమౌళికి ఉంది అనడంలో సందేహం లేదు.

ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఒప్పుకునే విషయం రాజమౌళి ది గ్రేట్‌.. తోప్‌ అని. అందుకే ఆయన ఈ కటౌట్‌ కు అన్ని విధాలుగా అర్హుడు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ లో జక్కన్న కటౌట్‌ ను విడుదలకు వారం ముందే ఏర్పాటు చేశారు. ఇద్దరు హీరోల కటౌట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. కాని ఎక్కువ మంది దృష్టిని మాత్రం రాజమౌళి కటౌట్‌ ఆకర్షిస్తుంది. రాజమౌళిని అలా చూస్తుంటే ఒక అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించిన దేవుడిని చూసినట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

జక్కన్న మాస్ హీరోల కంటే పది రెట్ల మాస్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. అందుకే ఆయన కటౌట్‌ కు అర్హుడు.

ఇది తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు చెప్పే మాట. ఆర్ ఆర్‌ ఆర్‌ ను ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న జక్కన్న కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత మహేష్ బాబుతో సినిమాను షురూ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు