Begin typing your search above and press return to search.

'బాగుంది క‌దా' జ‌య‌మ్మ క్లాస్ మెలోడీ!

By:  Tupaki Desk   |   18 March 2022 9:37 AM GMT
బాగుంది క‌దా జ‌య‌మ్మ క్లాస్ మెలోడీ!
X
యాంకర్‌ సుమ కనకాల ఓవైపు బుల్లి తెర‌పై...సినిమా ఈవెంట్ల‌తో బిజీగా ఉంటూనే వ‌చ్చిన సినిమా అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పటికే ఆమె వెండి తెర‌పై న‌టిగా ఆమె ముద్ర వేసారు. చాలా సినిమాల్లో స‌పోర్టింగ్ పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల్ని మెప్పించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయతీ'. ఇందులో సుమ సాహ‌సోపేత‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. "పల్లెటూరి డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎవరికీ.. దేనికీ లొంగని పల్లెటూరి మహిళగా సుమ తెర‌పై క‌నిపించ‌నున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై పాజిటివ్ వైబ్ మొద‌లైంది. ఇక ఈసినిమా ప్ర‌చారం కోసం టాలీవుడ్ స్టార్స్ రంగంలోకి దిగ‌డం వివేషం. సినిమా టైటిల్ పోస్ట‌ర్ ని..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్క‌రించ‌గా.. నేచుర‌ల్ స్టార్ నాని తొలి లిరిక‌ల్ సింగిల్ ని రిలీజ్ చేసారు.

అటుపై టాలీవుడ్ హంక్ రానా ద‌గ్గుబాటి టీజ‌ర్ ని రిలీజ్ చేసారు. ఇలా టాప్ సెల‌బ్రిటీలంతా సినిమా కోసం క‌ద‌ల‌డం క‌లిసొచ్చే అంశంగా మారింది. ఆ ర‌కంగా ప్ర‌చార చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా 'బాగుంది క‌దా' అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్ ని మేక‌ర్స్ రిలీజ్ చేసారు. "నువ్వో రెక్క‌..అరెరే నేనో రెక్క రెక్క‌లు రెండు క‌లిపి చూద్దాము ఇంక మ‌న‌దే కాదా? చుక్క‌ల ఆకాశం" అంటూ సాగే పాట శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటుంది. సంగీత దిగ్గ‌జం ఎమ్. ఎమ్ కీర‌వాణి ఈ సినిమాకి బాణీలు స‌మ‌కూర్చ‌డంతోనే మ్యూజిక‌ల్ గా సినిమా ముందే హిట్ అయింది. తాజాగా ఆ స‌క్సెస్ ని లైవ్ లో చూస్తున్నాం. బాగుంది క‌దా సాంగ్ సంగీత ప్రియుల్ని ఆల‌రిస్తుంది.

పాట‌లో హీరో..హీరోయిన్ల బాల్యం ద‌శ ని హైలైట్ చేసారు. అంద‌మైన‌ విలేజ్ వాతావ‌ర‌ణ‌..గ్రీన‌రీ..సెలయేరు అందాలు ఆద్యంతం విజువ‌ల్ గా ఆక‌ట్టుకుంటున్నాయి. బాల్యంలోనే మొదలైన ప్రేమ‌ ద‌గ్గ‌ర నుంచి పెరిగి పెద్దైన వైనాన్ని పాట‌లో ఎంతో అందంగా రివీల్ చేసారు. సాహిత్యం బాగుంది.

ఈ చిత్రానికి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వ‌హించారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. అన్ని ప‌నులు పూర్తిచేసి ఏప్రిల్ 22న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.