Begin typing your search above and press return to search.

సుమ పంచాయితీ పెట్టేది ఎప్పుడంటే..!

By:  Tupaki Desk   |   14 March 2022 8:30 AM GMT
సుమ పంచాయితీ పెట్టేది ఎప్పుడంటే..!
X
తెలుగు బుల్లి తెర లేడీ సూపర్ స్టార్ బిరుదు కి సరిగ్గా సూట్ అయ్యే వ్యక్తి యాంకర్ సుమ. బుల్లి తెరపై సుమ చేసిన మ్యాజిక్ మరెవ్వరు కూడా చేయలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమ చేసిన ఏ షో అయినా... సినిమా ఫంక్షన్ కి హోస్ట్ గా వ్యవహరించినా కూడా అది సూపర్ హిట్ అనే టాక్ నడుస్తోంది. స్టార్ హీరోలు కావాలని మరీ సుమ యాంకర్ గా తమ సినిమా వేడుకలను ప్లాన్ చేసుకుంటారు.

ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్న సుమ మరో సారి సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. సుమ కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో నటించింది. అయితే నటిగా ఆమెకు ఎక్కువ గుర్తింపు దక్కలేదు. దాంతో చాలా తక్కువ సమయానికే ఆమె సినిమాల నుండి దూరం జరగాల్సి వచ్చింది. బుల్లి తెర పై ఏ సమయంలో అడుగు పెట్టిందో కాని ఆమెకు అనూహ్యంగా లేడీ సూపర్ స్టార్ హోదా దక్కింది.

యాంకర్ గా ఆమె కు రేటింగ్‌ ఇస్తే మొదటి పది స్థానాల్లో ఆమెనే నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆమె జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తోంది. సుమ సినిమా అంటేనే జనాల్లో ఆసక్తి ఉంటుంది.. అలాంటిది సినిమా గురించి వరుసగా వీడియోలు పోస్టర్లు విడుదల చేయడంతో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటించేందుకు కూడా ఒక ఫన్నీ వీడియో ని షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మొదట ఈ సినిమాను మార్చి 25 వ తారీఖున విడుదల చేద్దామని అనుకుంటున్నాము అని ప్రకటించగా అదే రోజున ఆర్ఆర్‌ఆర్ సినిమా ఉంది కనుక సాధ్యం కాదని అంటారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో విడుదల చేద్దాం అనగా కేజిఎఫ్ రాబోతుందని అంటారు.

ఆ తర్వాత మే నెలలో విడుదల తేదీని ప్రకటించగా ఆచార్య విడుదల కాబోతుంది అని అంటారు. అలా ఫన్నీగా ఈ వీడియోని డిజైన్ చేశారు. చివరకు సినిమా ఈ సినిమాను ఏప్రిల్ 22 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. చాలా విభిన్నమైన గెటప్పుల్లో సుమ కనిపించబోతోంది. ఒక పల్లెటూరి నేపథ్యం లో ఈ సినిమా రూపొందింది అని ఇప్పటికే వీడియో లు చూస్తే క్లారిటీ వచ్చేసింది. మరి సుమ రీ ఎంట్రీ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.