Begin typing your search above and press return to search.

ఫోటోటాక్: మండే సూర్యుడినే బంధిని చేసేస్తావా!

By:  Tupaki Desk   |   22 March 2022 11:30 AM GMT
ఫోటోటాక్: మండే సూర్యుడినే బంధిని చేసేస్తావా!
X
శృంగార తార‌ స‌న్నిలియోన్ ఘాటు ఫోజుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆన్ ది స్ర్కీన్ అయినా ఆఫ్ ది స్ర్కీన్ అయినా స‌న్ని లియోన్ టెంప్టింగ్ లుక్ కి స్ట‌న్ అవ్వాల్సిందే. తాజాగా బ్యూటీ కొత్త ఫోటో ఒక‌టి ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. పూల్ సైడున‌ ఉడ్డుపై వాలి హాట్ ఫోజులిచ్చి మ‌తులు చెడ‌గొడుతుంది. బ్రింజాల్ అండ్ వైట్ కాంబినేష‌న్ పై ఆరేంజ్ క‌ల‌ర్ స్విమ్ షూట్ లోకి బ్యూటీ దూరిపోయి క‌ళ్ల‌కి కూలింగ్ గ్లాసెస్ ధ‌రించి మండే సూర్య‌డిలోనే స‌ల‌ప‌రం పుట్టిస్తుంది. పైనుంచి భానుడి భ‌గ‌భ‌గ‌లు..కింద నుంచి స‌న్నిమంట‌లు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌త‌మ‌రమైన ప‌నే.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారియింది. స‌న్నిలియోన్ అభిమానులు హాట్ కామెంట్ల తో చెల‌రేగుతున్నారు. మరి మంట‌లు రేపుతోన్న ఈ రిసార్స్ట్ స్పాట్ ఎక్క‌డ‌? అన్న‌ది తెలియాలి. స‌మ్మ‌ర్ మొద‌లైపోవ‌డంతో తార‌లంతా చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో సేద తీర‌డానికి వెకేష‌న్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా రెగ్యులుర్ స్పాట్ మాల్దీవుల్లోనే మెజార్టీ భామ‌లు మ‌కాం వేస్తున్నారు. వేస‌వి ముగిసే వవ‌ర‌కూ మాల్దీవుల రిసార్స్ట్ ఫుల్ బిజీ అనే చెప్పాలి.

ఇక స‌న్నిలియోన్ సినిమాల విష‌యానికి వ‌స్తే ద‌క్షిణాదిలో సన్నీ చేసిన తొలి చిత్రం 'వడా కర్రీస‌. తమిళ్ లో ఈ సినిమా చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో 'కరెంట్ తీగ'.. ' గరుడవేగ' చిత్రాల్లో నటించింది. కన్నడ.. మలయాళ ఇండస్ట్రీల్లోనూ ప్రవేశించింది సన్నీ.

కానీ ఇక్క‌డ ఆశించిన విధంగా కెరీర్ సాగ‌లేదు. స‌న్నిబ్రాంబ్ ఇమేజ్ కోలీవుడ్ ..టాలీవుడ్ లో పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు. అయితే కేరళలో అమ్మడికి భారీగానే అభిమానులు ఉన్నారు. ఆ మ‌ధ్య కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళకు వెళ్లిన సన్నీలియోన్కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

ప్ర‌స్తుతం కోలీవుడ్ లో స‌న్నిలియోన్ టైటిల్ పాత్ర‌లో 'వీర‌మ్ దేవి' అనే 100 కోట్ల బ‌డ్జెట్ సినిమాలో నటిస్తోంది. ఇందులో స‌న్నిలియోన్ కి జోడీగా న‌వ‌దీప్ న‌టిస్తున్నాడు. స‌న్నిలియోన్ కెరీర్ లో ఇదే భారీ బ‌డ్జెట్ చిత్రం. ఈ సినిమా చాలా కాలం క్రితం ప్రారంభ‌మైంది. కానీ మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.

సినిమా ఉందా? ర‌ద్దాయిందా? అన్న‌ది క్లారిటీ లేదు. ఇంకా 'షీరో'..'ఓ మై ఘోస్ట్' చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ లో 'కోకో కోలా'..'హెలెన్'..'ది బ్యాటిల్ ఆఫ్ భీమా కొరిజియ‌న్' చిత్రాల్లో న‌టిస్తోంది.