Begin typing your search above and press return to search.

క‌ష్ట ప‌డితేనే సుఖం అంటోన్న ట‌బు!

By:  Tupaki Desk   |   4 Dec 2022 1:30 PM GMT
క‌ష్ట ప‌డితేనే సుఖం అంటోన్న ట‌బు!
X
వ‌య‌సులో ఉన్నప్పుడు క‌ష్ట‌ప‌డితేనే వ‌య‌సు ముదిరినప్పుడు సుఖ‌ప‌డ‌తాం. ఇప్పుడు ప‌నిచేయ‌క‌పోతే అప్పుడు ప‌రిస్థితి ఏంటి? అని తెల్ల ముఖం వేయాల్సి వ‌స్తుంది. చేతిలో అణా ఆడ‌దు. అప్పు చేయాలి. అది కొద్ది రోజులే . ఆ త‌ర్వాత అప్పులు తీర్చ‌డానికి తంటాలు ప‌డాలి. అందుకే భ‌విష్య‌త్ విష‌యంలో ప్లానింగ్ ఉండాల‌ని అనుభ‌వ‌జ్ఞులు చెబుతుంటారు.

తాజాగా బాలీవుడ న‌టి ట‌బు కూడా ఇలాంటి స‌ల‌హాలే ఇస్తోంది యువ‌త‌కి. అప్పుడు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసాను కాబట్టే ఇప్పుడు సుఖ ప‌డుతున్నాను అనేసింది. ఈ సీనియ‌ర్ భామ మ‌ళ్లీ తెలుగు..హిందీ చిత్రాల్లో బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన‌ అమ్మ‌డు వ‌య‌సు మీద ప‌డ‌టంతో కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైంది.

టాలీవుడ్ లో త్రివిక్ర‌మ్ ప్రోత్సాహంతో మ‌ళ్లీ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో కంబ్యాక్ అయింది. సినిమా విజ‌యం సాధించ డంతో అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. అలాగే హిందీలో లేటు వ‌య‌సులో ఘాటు రొమాన్స్ పండిస్తూ చెల‌రేగుతోంది. రొమాన్స్ చేయ‌డంలో న‌వ నాయిక‌ల‌కు ఏమాత్రం తీసిపోన‌ని రుజువు చేస్తోంది. ఇటీవ‌లే భూల్ భుల‌య్యా-2..దృశ్యం-2 చిత్రాల‌తో స‌క్సెస్ లు ఖాతాలో వేసుకుంది.

తాజాగా ఈ విజ‌యాల వెనుక చాలా క‌ష్టం ఉంద‌ని గుర్తు చేసింది. గ‌త ఏడాదిన్నర కాలంలో నాలుగైదు సినిమాల‌కు విశ్రాంతి లేకుండా ప‌నిచేసాను. అలా ప‌నిచేయ‌డం క‌ష్టంగానూ..చాలెంజింగ్ గానూ అనిపించింది. కోవిడ్ స‌మ‌యంలో చాలా ఇబ్బందులు ఎదుర‌య్యాయి. అయినా స‌రే వాటిని లెక్క చేయ‌లేదు. క‌ష్ట‌ప‌డాలి అని బ‌లంగా సంక‌ల్పిస్తే ఆ స‌మ‌యంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌న్ని చిన్న‌విగానే క‌నిపిస్తున్నాయి.

హీరోయిన్ గా బిజీ గా ఉన్నంత కాలం అలాగే ప‌ని చేసేదాన్ని. అందుకే ఇప్పుడు సుఖ ప‌డుతున్నా` అని తెలిపింది. ప్ర‌స్తుతం ట‌బు చేతిలో మూడు..నాలుగు హిందీ సినిమాలున్నాయి. అలాగే తెలుగులోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ వాటికి భారీగా పారితోషికం డిమాండ్ చేయ‌డంతో నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గుతున్నారు.