Begin typing your search above and press return to search.
మాటల మాంత్రికుడి పెన్నుకున్న పవర్ అది
By: Tupaki Desk | 15 March 2022 2:30 AM GMTస్టార్ డైరెక్టర్లు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడ్యూసర్ లుగా.. క్రేజీ ప్రాజెక్ట్ లకు సహ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. కొంత మంది కథలు అందిస్తూ సపోర్ట్ గా నిలుస్తున్నారు. మాటల మాంత్రికులు 'డీజే టిల్లు' లాంటి చిత్రాలకు తన అమూల్యమైన సలహాలు అందిస్తూనే పవన్ స్టార్ చిత్రాలకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'తీన్ మార్' చిత్రానికి స్క్రీన్ ప్లే అందించి శభాష్ అనిపించుకున్న త్రివిక్రమ్ ఇటీవల మరోసారి పవన్ చిత్రానికి స్క్రీన్ ప్లే. డైలాగ్స్ అందించిన వార్తల్లో నిలిచారు.
'వకీల్ సాబ్' చిత్రం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో రీమేక్ మూవీ 'భీమ్లానాయక్'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ కలిసి నటించిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'భీమ్లానాయక్' పేరుతో రీమేక్ చేశారు. పవన్, రానా కలిసి నటించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఇటీవల ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
ఈ మూవీ తరువాత పవన్ కల్యాణ్ వెంటనే మరో రీమేక్ ని పట్టాలెక్కించబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్రలో నటించి తెరకెక్కించిన తమిళ చిత్రం 'వినోదాయ సితం'. తంబి రామయ్య ప్రధాన పాత్రలో నటించారు.
ఇటీవలే ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఓ దేవ దూత సామాన్యుడి కోసం రావడం అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించారు. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలు సొంతం చేసుకున్నాయి.
జీ స్టూడియోస్ ప్రధాన భాగస్వామిగా కలిసి ఈ భారీ ప్రాజెక్ట్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నాయట. నటుడు సముద్రఖని దర్శకత్వం వహించనున్న ఈ తెలుగు రీమేక్ లోని కీలక పాత్రలో పవన్ కల్యాణ్ నటించబోతున్నారు. మరో ప్రధాన పాత్రలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తారట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైందని, సముద్రఖనితో కలిసి త్రివిక్రమ్ తెలుగు నేటివిటితో పాటు పవన్ ఇమేజ్ కు తగ్గ మార్పులు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
డైలాగ్స్ తో పాటు ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేని కూడా అందించబోతున్నారట. ఇందు కు ఆయన భారీ మొత్తం ఛార్జ్ చేస్తున్నారని చెబుతున్నారు. మాటలు, స్క్రీన్ ప్లే కోసం త్రివిక్రమ్ ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేశారట. కేవలం పవన్ కోసమే త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించబోతున్నారు. అలాగే కథలో మార్పులు చేస్తున్నారు. ఇందు కోసం త్రివిక్రమ్ 15 కోట్లు డిమాండ్ చేశారట. ఈ మొత్తాన్ని మేకర్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెబుతున్నారు.