Begin typing your search above and press return to search.

వెంకీతో 'జాతిర‌త్నాలు' ఫేం జాక్ పాట్?

By:  Tupaki Desk   |   19 March 2022 5:30 AM GMT
వెంకీతో జాతిర‌త్నాలు ఫేం జాక్ పాట్?
X
టాలీవుడ్ స్టార్ హీరో విక్ట‌రీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో F3 ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు అత‌డు తన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు చిత్రీక‌ర‌ణ‌లోను పాల్గొంటున్నాడు. తాజా స‌మాచారం మేరకు.. మరొక ఆసక్తికర స‌మాచారం చక్కర్లు కొడుతోంది.

తాజా గాసిప్ ప్రకారం.. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమాలో నటించనున్నారు. రెండు నెలల క్రితం అనుదీప్ చెప్పిన కథను వెంకీ ఓకే చేశాడని గుస‌గుస‌లు విన‌పించాయి. ఇది కామెడీ కం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఇంకా ఎవరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.

అనుదీప్ ప్రస్తుతం శివకార్తికేయన్ తో తెలుగు-తమిళ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అతను ప్రస్తుత ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత వెంకటేష్ తో చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది.

చ‌క్క‌ని కామెడీ టైమింగ్ లో సీనియ‌ర్ అయిన వెంక‌టేష్ తో అంతే గొప్ప ఫ‌న్ రైడ్ తో టైమింగ్ టింజ్ ఉన్న ద‌ర్శ‌కుడు అనుదీప్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించ‌వ‌చ్చు. జంధ్యాల త‌ర‌హాలో మ‌రో క్లీన్ కామెడీకి అనుదీప్ ప్ర‌య‌త్నిస్తాడ‌న‌డంలో సందేహం లేదు.

బూతు లేని ఆహ్లాద‌క‌ర‌మైన కామెడీతో తెలుగు సినిమాకి మ‌ళ్లీ జంధ్యాల డేస్ ని తీసుకురావాల‌ని కోరుకుందాం.