Begin typing your search above and press return to search.
హీరో ముఖాన్ని దాచేసి ఫజిల్ వేసిన రష్మిక
By: Tupaki Desk | 8 March 2022 4:37 AM GMTఛలో చిత్రంతో తెలుగు తెరపై మెరిసి గీత గోవిందంతో మరో లెవల్ ఏంటో చూపించింది రష్మిక మందన. ఆ తర్వాత వరుసగా సరిలేరు నీకెవ్వరు- పుష్ప లాంటి బంపర్ హిట్లతో తన రేంజు స్కైని టచ్ చేసింది. మహేష్ - బన్ని లాంటి అగ్ర హీరోల సరసన నటించేసిన ఈ బ్యూటీ మునుముందు బాలీవుడ్ లో సత్తా చాటనుంది. రష్మిక మందన్న ప్రస్తుతం అత్యంత బిజీ నటిగా కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్ లో మరో కొత్త ప్రాజెక్ట్ గురించి రివీల్ చేసింది. అయితే అతడు ఎవరో కనిపెట్టండి అంటూ ఫజిల్ వేసింది ఈ బ్యూటీ.
``ఈరోజు నేను ఎవరితో షూట్ చేస్తున్నానో ఊహించండి`` అంటూ ఫజిల్ వేసింది కిల్లర్ లేడీ రష్మిక. ఆ హీరో ఎవరో ముఖాన్ని చూపించకుండా ఆట పట్టిస్తోంది. అయితే అది మరెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ హంక్ వరుణ్ ధావన్ అని తెలిసిపోతోంది. అంటే రష్మిక- వరుణ్ జంట ఇప్పటికే ఏదో షూటింగ్ లో ఉన్నారు. రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ కథనంలో హీరో ముఖాన్ని బహిర్గతం చేయకుండా అతని చిత్రాన్ని పంచుకోగా దానిని అభిమానులు వైరల్ చేస్తున్నారు.
అయితే ఈ జోడీ దేనికోసం..? సినిమా కోసమా? ఏదైనా ప్రకటన కోసమా? వెబ్ సిరీస్ కోసమా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వరుణ్ ఇన్ స్టాలో వివరం ఏదైనా ఉంటుందా? అని పరిశీలిస్తే.. అతడు తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో జిమ్ నుండి ఒక వీడియోను పంచుకున్నాడు. బాగా ఉత్సాహపరిచే ఉత్తేజకరమైన వార్తలను ప్రకటించాలని అతడు అడిగాడు. ఏది ఏమైనా ఈ జోడీ ఇంట్రెస్టింగ్. రష్మిక మందన్న బాలీవుడ్ లో ఘనంగా అడుగుపెడుతోంది. ఆరంభమే క్రేజీ హీరోల సరసన నటించేస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను లో నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కుమార్తెగా `గుడ్ బై` అనే ప్రయోగాత్మక చత్రంలో నటిస్తోంది. రష్మిక ఇప్పటికే నేషనల్ క్రష్ గా వెలిగిపోతోంది. దాంతో పాటే హిందీ-తెలుగులో ఆఫర్లు అలా వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
బాలీవుడ్ తర్వాత రష్మిక నెక్ట్స్ ప్లాన్?
చూస్తుండగానే రష్మిక దూసుకుపోతోంది. రష్మిక లైనప్ ఒక రేంజులో ఉంది. కన్నడ బ్యూటీ దూకుడు ఒక రేంజులో ఉంది . ఛలో చిత్రంతో హిట్టు కొట్టి నాలుగేళ్లలోనే టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా నటించేస్తూ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ అయిపోయింది. పుష్ప చిత్రంతో ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా వెలిగిపోతోంది. నిజానికి సౌత్ ఇండియన్ హీరోయిన్లకు బాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రావు. కానీ రష్మికకి వరస ఆఫర్లు దక్కుతున్నాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..``మనం సరైన సినిమా చేసినప్పుడు మన గురించి ప్రేక్షకులు సరైన అనుభూతి చెందుతారు. నేను కూడా అంతే. అప్పుడే ఏదైనా వర్కవుట్ అవుతుంది..`` అని గడుసైన సమాధానమిచ్చింది.
తనకు సౌత్ ఇండియన్ సినిమాలు ఉత్తర భారతదేశంలో విస్తృత ఖ్యాతిని తెచ్చిపెట్టాయని చెప్పింది. ప్రస్తుతం ఉత్తరాది ప్రజలు తనను శ్రీవల్లి (పుష్ప)... గీత (గీత గోవిందం) వంటి పాత్రల పేర్లతో పిలుస్తున్నారని తెలిపింది. తనకు ఇతర పరిశ్రమలే బాలీవుడ్ అని అంటోంది రష్మిక. ప్రభావవంతమైన పాత్రలు చేయడానికి నా బెస్ట్ అందించడానికి నేను ఎదురుచూస్తున్నాను. భాష ఎప్పుడూ అడ్డంకి కాదు ఎందుకంటే నేను ఎప్పుడూ వివిధ భాషలలో పాత్రలు చేయడాన్ని ఆనందించాను... అని తెలిపింది. తనను నార్త్ నటి లేదా సౌత్ నటి అని ట్యాగ్ చేయకూడదని రష్మిక పేర్కొంది. ఆమె పాన్-ఇండియా నటిని అని కాన్ఫిడెంట్ గా చెప్పింది.
రష్మిక నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. పుష్ప 2లోనూ రష్మిక మందన కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే శాండల్ వుడ్ టు టాలీవుడ్ ఇట్నుంచి బాలీవుడ్ వెళ్లింది. ఇక హాలీవుడ్ లోనూ నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు.