Begin typing your search above and press return to search.
మాస్ లో బాసూ ఏంటండీ ఈ క్లాసీ లుక్కు?
By: Tupaki Desk | 14 Aug 2022 2:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ లో టింజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఓవైపు క్లాస్ ని మరోవైపు మాస్ ని మెప్పించిన అసాధారణ మ్యానరిజమ్స్ ఆయనకు మాత్రమే ప్రత్యేకం. అనన్య సామాన్యమైన జనాకర్షక శక్తి ఉన్న ఏకైక స్టార్ గా ఇప్పటికీ వెలిగిపోతున్నారు.
ఇక మాస్ లో బాస్ గా గొప్ప ఆదరణతో మెగా బంపర్ హిట్లు కొట్టి చూపించారు. అదే సమయంలో క్లాస్ ఆడియెన్ సైతం ఆయనకు సలాం కొట్టని వాళ్లు లేరు. అందుకే చిరు నటించిన సినిమా వస్తోంది అంటే దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తారు.
ప్రస్తుతం చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు. వరుసగా వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. వీటిలో మాస్ లుక్ తో పాటు క్లాస్ లుక్ తో కూడా అలరించనున్నారు. అయితే పెద్ద తెర సంగతేమో కానీ రియల్ లైఫ్ లో కూడా ఆయన లోని విలక్షణతకు అద్దం పట్టే ఓ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
ఇందులో ఆయన ఎంతో క్లాసీగా కనిపిస్తున్నారు. బెంగాళీ స్టైల్లో ఆయన లాంగ్ కుర్తా పైజామా ధరించి దానిపై అల్ట్రా స్టైలిష్ కోట్ ని కూడా మ్యాచింగ్ చేసారు. టాప్ టు బాటమ్ క్రీమ్ కలర్ కుర్తాలో ఆయన సమ్మోహన రూపంతో మైమరిపిస్తున్నారు.
స్మార్ట్ లుక్ కి తగ్గ హెయిర్ స్టైల్.. కళ్లకు షేడెడ్ గ్లాసెస్.. చేతికి వాచీ.. కుర్తాకు తగ్గ డిజైనర్ చెప్పల్స్ ని కూడా మ్యాచ్ చేసిన తీరు ఆకట్టుకుంది. మెగా బాస్ ని ఇటీవల ఇలాంటి క్లాసిక్ లుక్ తో చూసింది లేదు. పెళ్లిళ్లు పండగలు ఫ్యామిలీ ఈవెంట్లలో మాత్రమే చిరు ఇలా కనిపిస్తుంటారు. కానీ ఇప్పుడిలా సర్ ప్రైజ్ చేసారు. అందుకే ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో షేర్ అవుతోంది.
చిరు నటించిన గాడ్ ఫాదర్ త్వరలో విడుదలకు రానుంది. తదుపరి మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` తో పాటు బాబి దర్శకత్వంలో `వాల్తేర్ వీరయ్య` కూడా సెట్స్ పై ఉన్నాయి. గాడ్ ఫాదర్ లో గంభీరంగా కనిపించే పెద్ద మనిషి పాత్రలో కనిపిస్తారు. అలాగే భోళా శంకర్ లో ఎదురేలేని జెంటిల్మన్ గా పవర్ ఫుల్ పాత్రతో అలరించనున్నారు. బాబి సినిమాలో పూర్తి మాస్ అవతార్ తో కనిపిస్తారు. ఇది ఒక మెగాభిమాని కథతో రూపొందుతోందన్న టాక్ కూడా ఉంది. అయితే ఆ మూడు సినిమాల్లో పొలిటికల్ గేమ్ నేపథ్యంలో సాగే `గాడ్ ఫాదర్` లో చిరు లుక్ కి ఈ ఫోటోగ్రాఫ్ ఒక ప్రతిబింబంగా కూడా కనిపిస్తోందని భావించవచ్చు.