Begin typing your search above and press return to search.
అవార్డ్ ఫంక్షన్ లో హాటీ జిల్ జిల్ జిగేల్
By: Tupaki Desk | 3 Aug 2022 2:30 AM GMTప్రియాంక చోప్రా కజిన్ గా మన్నారా చోప్రా గురించి ప్రచారం ఉంది. కానీ ఇదేదీ తన కెరీర్ కి ఎంతమాత్రం ఉపయోగపడలేదన్నది నిజం. టాలీవుడ్ లో దశాబ్ధ కాలంగా మన్నారా బిగ్ రేంజ్ కెరీర్ కోసం పాకులాడుతూనే ఉంది. కానీ ఇక్కడ ఆశించిన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
తనను వరించిన మిడ్ రేంజ్ అవకాశాలు కూడా తనకు నిరూపించుకునే ఛాన్స్ ఇవ్వలేదు. అంత పెద్ద రేంజ్ స్టార్లతో నటించే అవకాశాలు లేకపోవడం ఒక మైనస్ అనుకుంటే నటించిన సినిమాలు కూడా హిట్లు కొట్టలేదు. తెలుగు సినీపరిశ్రమతో పాటు తమిళంలోనూ లక్ చెక్ చేసుకున్నా అక్కడా కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు.
అయితే ర్యాంప్ షోలు.. రిబ్బన్ కటింగులతో ఈ బ్యూటీ సౌత్ లో కొంత బిజీగానే కనిపించింది. సోషల్ మీడియాల్లోనూ ప్రకటనల్లో కనిపిస్తూ తనదైన శైలిలో ఆర్జిస్తోంది. తాజాగా మన్నారా చోప్రా ముంబైలో ఓ అవార్డు ఫంక్షన్ లో ఇలా పింక్ శారీలో మెరిపించింది. మన్నారా జిగిబిగి అందాల మెరుపులతో అవార్డ్ ఫంక్షన్ లో షో స్టాపర్ గా నిలిచింది. పింక్ చీరకు కాంబినేషన్ గా మెడలో వైట్ (పెర్ల్) ముత్యాల హారాన్ని ఫోకస్ చేసిన తీరు ఆకట్టుకుంది. అలా నవ్వులు చిందిస్తూ హుషారుగా కనిపించిన మన్నారా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
కోవిడ్ రంగ ప్రవేశం ఒక శాపం
కెరీర్ పరుగులో భాగంగా ముంబై టు హైదరాబాద్ ప్రయాణించే తనకు కరోనా క్రైసిస్ పెద్ద సమస్యాత్మకంగా మారిందని వాపోయింది మన్నారా. వాణిజ్య ప్రకటనల్లో నటించాలన్నా.. లేదా ఏదైనా సినిమాలో చేయాలన్నా అటూ ఇటూ విమానాల్లో ప్రయాణించాలి. కానీ అనూహ్యంగా 2020 లో లాక్డౌన్ సమయంలో పనిలేకుండా కూర్చోవలసి వచ్చిందని వాపోయింది ముంబై బ్యూటీ మన్నారా చోప్రా. గత ఏడాది అక్టోబర్ లో క్రైసిస్ వల్ల హైదరాబాద్ కు మకాం మార్చిన మన్నారా ఆ తర్వాత కెరీర్ లో బిజీ అయిపోతానని ఆశించి భంగపడింది. ముంబై - హైదరాబాద్ మధ్య అటూ ఇటూరాకపోకలు సాగిస్తూ వాణిజ్య ప్రకటనలతో పాటు కొన్ని ఇతర ప్రాజెక్టుల షూటింగ్ కి జాయిన్ కావాల్సి ఉండగా.. రెండో వేవ్ వల్ల మన్నారా తన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యింది.
గత సంవత్సరం మార్చిలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు దేశంలోని పరిస్థితుల గురించి నేను నిరుత్సాహపడ్డానని.. పని చేయలేకపోయానని తెలిపింది. అన్ లాక్ దశ లోనూ ఇబ్బంది పడినట్టు మన్నారా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హైదరాబాద్ వచ్చాక ఏకంగా నాలుగు నెలలకు పైగా ఇక్కడ ఒక హోటల్ లోనే లాక్ అయిపోయానని తెలిపింది. పనిలేకుండా ఉండే సమయాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమైంది అని అన్నారు. మార్చి 2021 లో ముంబైకి తిరిగి వెళ్లాక అక్కడ పరిస్థితి చాలా భయానకంగా మారింది. మొదటిసారి నేను హైదరాబాద్ ఇతర ప్రదేశాలలో కొన్ని ప్రాజెక్టులను వదిలేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.
సెకండ్ వేవ్ లో కరోనా సోకడంతో ముంబైలోని ఒక వైద్యుడి వద్దకు వెళ్ళానని కూడా తెలిపింది. కరోనా సమయంలో మన్నారా `హేల్ దిల్` అనే షార్ట్ ఫిలింలో నటించింది.