Begin typing your search above and press return to search.

క్లిక్ క్లిక్‌ : గ్లోబల్‌ స్టార్‌ అమ్మతనం తర్వాత మళ్లీ గ్లామర్ ఫీల్డ్‌ లోకి రీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   22 March 2022 5:04 AM GMT
క్లిక్ క్లిక్‌ : గ్లోబల్‌ స్టార్‌ అమ్మతనం తర్వాత మళ్లీ గ్లామర్ ఫీల్డ్‌ లోకి రీ ఎంట్రీ
X
బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్‌ లో కూడా సత్తా చాటిన ప్రియాంక చోప్రా గ్లోబల్‌ స్టార్ అంటూ పేరు దక్కించుకుంది. అద్బుతమైన తన నటన ప్రతిభతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ రాక్ స్టార్‌ అయిన నిక్‌ జోనస్‌ ను ఈ అమ్మడు కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అతడి కంటే పీసీ పదేళ్లు వయసు లో పెద్దది. అయినా కూడా ఇద్దరి సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతోంది.

ఈమద్యే ఈ గ్లోబల్ క్యూట్‌ కపుల్‌ తల్లిదండ్రులు కూడా అయ్యారు. సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులుగా మారిన వీరు అమెరికాలో అత్యంత విలాసవంతమైన విల్లాలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ప్రియాంక చోప్రా తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తుంది. చాలా తక్కువగా బయటి కార్యక్రమాలకు హాజరు అవుతోంది. ఎట్టకేలకు ఆమె షూటింగ్ కు హాజరు అయ్యింది. ఒక సినిమా షూటింగ్‌ లో ప్రియాంక జాయిన్ అయ్యింది.

రోమ్‌ లో ప్రియాంక చోప్రా షూటింగ్‌ లో పాల్గొంటున్న ఫోటోలను షేర్‌ చేశారు. బ్లాక్ డ్రస్ లో ఆమె అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా మళ్లీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఈమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

నెట్టింట ప్రియాంక చోప్రా సినిమా ల్లోకి రీ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె నటిస్తున్న సినిమాల గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

బాలీవుడ్‌ లో కూడా ప్రియాంక చోప్రా ఒక సినిమాను నటించేందుకు కమిట్‌ అయ్యింది. తల్లి అయిన ప్రియాంక చోప్రా షార్ట్‌ గ్యాప్‌ తీసుకుని సినిమా ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవ్వడం పట్ల అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఆమద్య నిక్‌ తో ప్రియాంక విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఆ విషయం పై పీసీ తల్లి స్పందిస్తూ పుకార్లే అంటూ కొట్టి పారేసింది. అంతే కాకుండా ప్రియాంక చోప్రా కూడా నిక్ తో ఉన్న ఫోటో లను షేర్‌ చేయడం ద్వారా ఆ పుకార్లకు చెక్ పెట్టింది.