Begin typing your search above and press return to search.
ఇంతకీ RRR హీరోస్ రెమ్యునరేషన్స్ ఎంత?
By: Tupaki Desk | 10 March 2022 11:52 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న నేపథ్యంలో అందిరి దృష్టి ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్` వైపు మళ్లింది. `రాధేశ్యామ్` రిలీజైన దాదాపు రెండు వారాల వ్యవధిలో `ఆర్ ఆర్ ఆర్` థియేటర్లలో రాబోతోంది. మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
తొలి సారి స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ మల్టీస్టార్ మూవీ కావడం.. చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ల కు చెందిన ఫిక్షనల్ స్టోరీ కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి.
కరోనా కారణంగా గత కొంత కాలంగా రిలీజ్ వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే రిలీజ్ ఆలస్యం కావడం వల్ల మేకర్స్ ఇప్పటికే తమకు రావాల్సిన ఫ్రాఫిట్ లో 60 కోట్లని కోల్పోవాల్సి వచ్చిందట.
రిలీజ్ నెలల తరబడి డిలే కావడం వల్ల ఇంట్రెస్ట్ లు పెరిగిపోవడంతో లాభాలని సొంతం చేసుకుంటామని ఆశించిన మేకర్స్ 60 కోట్ల మేర లాభాలని వదులుకోవాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్.
ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ మూవీ కోసం దాదాపు మూడేళ్లు కేటాయించారు. ఇందు కోసం ఈ ఇద్దరు హీరోల్లో ఒక్కో హీరో అందుకున్న పారితోషికం 45 కోట్లు.
ఇందులో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇందుకు గానే ఆయనకు 25 కోట్లు అందజేశారట. ఈ మూవీతో బాలీవుడ్ క్రేజీ లేజీ అలియాభట్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.
అలియాభట్ కు హిందీలో మంచి డిమాండ్ వుండటంతో ఆమెకు రెమ్యునరేషన్ కింద 9 కోట్లు ఇచ్చారట. ఇక ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా వ్యవహరించిన రాజమౌళి రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటాని తీసుకుంటానని అగ్రిమెంట్ చేసుకున్నారట.
మిగతా మొత్తం నిర్మాత డీవీవీ దానయ్య కు చెందుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం మేకర్స్ ఇప్పటికే డీసెంట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్నారని, 300 మేర బిఫోర్ రిలీజ్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ తరువాత టాక్ ని బట్టి సినిమా సాధించబోయే ప్రాఫిట్స్ పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. థియేట్రికల్ గా సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మేకర్స్ కి ప్రాఫిస్టే ప్రాఫిట్స్ అని చెప్పుకుంటున్నారు.
ఏం జరగబోతోందన్నది తెలియాలంటే మార్చి 25 వరకు వేచి చూడాల్సిందే. హాలీవుడ్ నటులు ఒలివియా మోరీస్, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ కీలక పాత్రల్లో నటించగా కీరవాణి సంగీతం అందించారు.