Begin typing your search above and press return to search.

సార్‌' ఆ వార్తల్లో సగమే నిజం

By:  Tupaki Desk   |   11 Jan 2022 8:31 AM GMT
సార్‌ ఆ వార్తల్లో సగమే నిజం
X
కోలీవుడ్‌.. బాలీవుడ్‌ చివరకు హాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ తెలుగు లో మాత్రం ఆశించిన స్థాయిలో స్టార్‌ డమ్‌ ను దక్కించుకోలేక పోయాడు. ఆయన నటించిన పలు తమిళ సినిమా లు తెలుగు లో విడుదల అయినా కూడా ఒక్కటి రెండు మాత్రమే పర్వాలేదు అనిపించుకున్నాయి. అవి కూడా కమర్షియల్ గా మంచి ఫలితాన్ని దక్కించుకున్న దాఖలాలు లేవు. అందుకే పట్టుదలతో తెలుగు లో ధనుష్‌ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించి టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఒక్కసారే రెండు తెలుగు సినిమా లను ఆయన చేసేందుకు గాను సైన్ చేశాడు.

మొదట శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్‌ ను అధికారికంగా ప్రకటించారు. కాని వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్‌ సినిమా ను పట్టాలెక్కించారు. ఇటీవలే షూటింగ్‌ ను ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. షూటింగ్‌ ప్రారంభించిన వెంటనే యూనిట్‌ సభ్యుల్లో ఒకరికి కరోనా అంటూ నిర్థారణ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయినా కూడా షూటింగ్‌ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగి పోతుంది. ఆ విషయమై క్లారిటీ రాకుండానే మరో పుకారు ఒకటి సార్ గురించి వినిపిస్తుంది. సార్‌ సినిమా లో ధనుష్‌ కు జోడీగా ఎంపిక అయిన సంయుక్త మీనన్‌ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే మేకర్స్ మరో హీరోయిన్‌ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ పుకారు లో సగం నిజం ఉండగా మరో సగం మాత్రం వాస్తవం కాదు అని పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చారు.

సంయుక్త మీనన్‌ ను సినిమా నుండి తప్పించారని లేదా ఆమె స్వయంగా తప్పుకుందనే వార్తలో నిజం లేదు. కాని సినిమా కోసం మరో హీరోయిన్‌ తో చర్చలు జరుపుతున్న మాట వాస్తవం అన్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏంటీ అంటే సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్‌ కంటిన్యూ అవుతుంది.. ఇదే సమయంలో సినిమా లో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర కోసం మేకర్స్ అన్వేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్‌ తో చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్‌ లో అది కూడా ధనుష్‌ వంటి ఒక భారీ హీరోతో సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ ఒక్క హీరోయిన్‌ కూడా కాదనుకోదు. అలాంటిది సంయుక్త ఎలా కాదు అనుకుంటుంది. మలయాళంలో ఇప్పుడు ఆమె చాలా సినిమాలు చేస్తుంది. అందులో అయినా క్యాన్సిల్‌ చేసుకుంటుంది కాని ధనుష్ సార్ మూవీని మాత్రం ఆమె వదులుకోదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సార్ మాత్రమే కాకుండా తెలుగు లో ఆమె ముందు ముందు చాలా సినిమాలను చేయబోతుంది. అందుకు సంబంధించిన ఒప్పందాలకు కూడా ఆమె సైన్ చేసింది. సార్ కు జోడీగా నటించబోతున్న ఆ రెండవ హీరోయిన్‌ ఎవరు అనేది చూడాలి.