Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు ఓట‌ర్ కి లైన్ క్లీరయ్యినట్టేనా!

By:  Tupaki Desk   |   11 Jun 2019 6:27 PM IST
ఎట్ట‌కేల‌కు ఓట‌ర్ కి లైన్ క్లీరయ్యినట్టేనా!
X
మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా జి.కార్తీక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఓట‌ర్` రిలీజ్‌ డైల‌మా గురించి తెలిసిందే. క‌థానాయ‌కుడితో ద‌ర్శ‌కుడికి భేధాభిప్రాయాలు రావ‌డంతో అర్థాంత‌రంగా సినిమా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే వివాదాల‌తో జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయింది. ప‌లుమార్లు రిలీజ్ వాయిదాపై ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఓట‌ర్ క‌థ రైట్స్ విష‌యంలో వ‌చ్చిన భేధాభిప్రాయాల‌పై వివ‌ర‌ణ ఇచ్చిన కార్తీక్ రెడ్డి కొన్ని ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేశారు. ఓట‌ర్ చిత్రం అసెంబ్లీ రౌడీ కి రీమేక్ కాద‌ని.. ఆ క‌థ‌తో ఓట‌ర్ కి ఏమాత్రం సంబంధం లేద‌ని.. క‌థాంశం పూర్తిగా త‌న సృజ‌నాత్మక‌త నుంచి పుట్టిన‌దేన‌ని ద‌ర్శ‌కుడు జి.కార్తీక్ రెడ్డి చెబుతున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఏ హీరో చేయ‌ని విధంగా మంచు విష్ణు `ఓట‌ర్` రిలీజ్ ని అడ్డుకున్నార‌ని ఆరోపించారు. త‌న పారితోషికానికి సంబంధించిన విష‌యాల్ని కార్తీక్ రెడ్డి ఓ వీడియో బైట్ లో వెల్ల‌డించారు.

అయితే వివాదం తర్వాత ఓట‌ర్ టీమ్ నుంచి రిలీజ్ విష‌య‌మై స‌రైన అధికారిక స‌మాచారం లేదు. దీంతో ఇప్ప‌టికీ ఓట‌ర్ రిలీజ్ స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఈనెల 21న రిలీజ్ అంటూ ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నా చిత్ర యూనిట్ నుంచి స‌రైన క్లారిటీ లేదు. ఒక‌వేళ‌ రిలీజ్ వ‌ర‌కూ వ‌చ్చింది అంటే ద‌ర్శ‌కుడు - హీరో మ‌ధ్య వివాదానికి ప‌రిష్కారం దొరికింద‌నే అర్థం. రాజీకి వ‌చ్చి ఈ సినిమాని సాఫీగా రిలీజ్ చేస్తున్నార‌ని భావించ‌వ‌చ్చు. అయితే అందుకు సంబంధించి క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం లేదు.

ఇక ఓట‌ర్ క‌థాంశం ప‌రిశీలిస్తే ఇదో పొలిటిక‌ల్ డ్రామా. రాజకీయ నాయకులు పదవిలోకి రావాలన్నా.. పోవాలన్నా ఓటు ఎంతో ముఖ్యం. అది వేసే ఓటర్‌ మరింత ముఖ్యం. ఓటును.. ఓటర్‌ బాధ్యతను గుర్తు చేస్తూ మంచు విష్ణు పాత్రను మ‌లిచామ‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. సురభి ఈ చిత్రంలో కథానాయిక. థ‌మ‌న్ సంగీతం అందించారు. ఈ చిత్రం త‌మిళ వెర్ష‌న్ కు`కుర‌ల్ 388` అనే టైటిల్ ని ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే.