Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్.. ప్రణ‌య విషాద గీతం..!

By:  Tupaki Desk   |   9 March 2022 3:32 AM GMT
రాధేశ్యామ్.. ప్రణ‌య విషాద గీతం..!
X
రాధే శ్యామ్ కొత్త పాట మెయిన్ ఇష్క్ మే హూన్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ - పూజా హెగ్డేల ప్ర‌ణ‌య‌ భూకంపానికి కార‌ణ‌మేంటో క‌నుగొనాలి అనిపించేంత‌టి ఉత్కంఠ‌ను ఈ పాట‌లో ఆవిష్క‌రించారు. శుక్రవారం రాధే శ్యామ్ విడుదలకు ముందు మెయిన్ ఇష్క్ మే హూన్ అనే కొత్త పాట విడుదల కాగా వైర‌ల్ గా దూసుకెళుతోంది. రాధే శ్యామ్ మార్చి 11న థియేటర్లలోకి రానుంది.

రాధే శ్యామ్ లేటెస్ట్ సాంగ్ “మైన్ ఇష్క్ మే హూన్” మంగళవారం విడుదలైంది. మ్యూజికలో వీడియోలో ప్రభాస్ - పూజా హెగ్డే పాత్రలు ఆద్యంతం ర‌క్తి కట్టిస్తున్నాయి.

విక్రమాదిత్య- ప్రేరణల ప్రేమకథ ఈ పాట‌ను చూశాక ఎంతో ఆస‌క్తిని పెంచుతోంది. ఇది ప్రేరణ‌- విక్రమాదిత్య ప్రేమ వికసించే దృశ్యాలతో ప్రారంభమవుతుంది. అది చివరికి విధ్వంసానికి దారి తీస్తుంది.. అయితే దీనిని ముందే గ్ర‌హిస్తాడు విక్ర‌మాదిత్య‌. విక్రమాదిత్య చెప్పినట్లుగా భూకంపం లాంటి విప‌త్తే సంభ‌విస్తుందని అర్థ‌మ‌వుతోంది.

మనన్ భరద్వాజ్ - హర్జోత్ కౌర్ పాడిన ఈ పాట‌ ఒక సాధారణ శృంగార గీతం అని చెప్పాలి. దాని వీడియో ప్రతి ప్రభాస్ అభిమానికి ఒక ట్రీట్ లాంటిదే. ఎందుకంటే డార్లింగ్ స‌ర‌సం విర‌సం సొగ‌సు ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తాయి. పూజా హెగ్డే తన ఆల్-వైట్ లుక్ లో చాలా అందంగా క‌నిపిస్తోంది. మొత్తంమీద పాటలో మిమ్మల్ని ట్యూన్ చేసేలా అసాధారణమైనది ఏమీ లేక‌పోయినా అంద‌మైన విజువ‌ల్స్ తో సాగుతోంది. ఈ పాటకు మానన్ భరద్వాజ్ సంగీతాన్ని కూడా సమకూర్చారు. కుమార్ సాహిత్యం రాశారు.

ట్విట్టర్‌లో పాటను పంచుకుంటూ పూజా హెగ్డే ఇలా రాసింది. “విధి మీ ప్రేమను డామినేట్ చేసిన‌ప్పుడు!.. మ్యూజిక్ ఆఫ్ ఏజెస్.. రాధేశ్యామ్.. #MainIshqMeinHoonని అందిస్తున్నాను`` అని తెలిపారు. రాధే శ్యామ్ ఆల్బమ్ లోని “మరో హృదయాన్ని హత్తుకునే పాట” అని ప్రభాస్ పేర్కొన్నాడు.

రాధే శ్యామ్ కి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1970ల నాటి యూరప్ నేపథ్యంలో సాగుతుందని ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపిస్తాడని సమాచారం. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడుతూ, “రాధే శ్యామ్ లోని విక్రమాదిత్య పాత్ర యూరోపియన్ పామిస్ట్ చెయిరో నుండి ప్రేరణ పొందింది. అలాగే రెండు మూడు నిజ జీవితంలో జరిగిన సంఘటనలను చేర్చి కథను డెవలప్ చేశాం... అని తెలిపారు.

ఈ చిత్రంలో ప్రభాస్ - పూజతో పాటు సచిన్ ఖేడేకర్ .. ప్రియదర్శి పులికొండ.. భాగ్యశ్రీ.. మురళీ శర్మ.. కునాల్ రాయ్ కపూర్, .. రిద్ధి కుమార్, సాషా చెత్రీ.. సత్యన్ కూడా నటిస్తున్నారు. మార్చి 11న థియేటర్లలోకి రానుంది.