Begin typing your search above and press return to search.
శాతకర్ణి కోసం స్పెషల్ గా 20 స్క్రీన్స్
By: Tupaki Desk | 8 Jan 2017 11:30 AM GMTనందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. శాతవాహన సామ్రాజ్య అధిపతి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ఈ చిత్రంలో నాలుగు యుద్ధ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. సాధారణంగానే యాక్షన్ సీక్వెన్స్ లకు మ్యూజిక్.. రీ రికార్డింగ్ ఆయువు పట్టు.
అలాంటిది చారిత్రక చిత్రం అంటే.. వీటి ప్రాధాన్యత మరింతగా ఉంటుంది. ఇప్పుడు బాలయ్య మూవీలో కూడా యుద్ధాలను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసేందుకు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 థియేటర్లు లేటెస్ట్ సౌండ్ టెక్నాలజీ డాల్మీ అట్మోస్ కు అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఈ విధానం ద్వారా శబ్దంలో స్పష్టత పెరగడమే కాదు.. ప్రతీ మూల నుంచి ప్రతీ సౌండ్ చాలా క్లియర్ గా వినే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది. ప్రత్యేకంగా శాతకర్ణి కోసం 20 థియేటర్లు ఈ టెక్నాలజీని సంతరించుకుంటున్నాయి. ఈ అప్ గ్రెడేషన్ కు సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ థియేటర్లకు ప్రత్యేకంగా డాల్మీ అట్మోస్ ప్రింట్స్ ను పంపనున్నారు.
అయితే.. ఈ వ్యవస్థను గతంలోనే అమర్చుకున్న ఓవర్సీస్ లోని థియేటర్లకు ఈ హైలైవెల్ సౌండింగ్ టెక్నాలజీతో కూడిన ప్రింట్స్.. ఇవాళ రాత్రికి బయల్దేరనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ఏరియాలకు.. రిలీజ్ రోజు ముందునాటికి అందేలా ప్రింట్స్ పంపనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/