Begin typing your search above and press return to search.

#వాడివాస‌ల్‌.. పొగ‌రుమోతు ఎద్దును అలా ఆపిన‌ సూర్య

By:  Tupaki Desk   |   23 July 2022 2:54 PM GMT
#వాడివాస‌ల్‌.. పొగ‌రుమోతు ఎద్దును అలా ఆపిన‌ సూర్య
X
సౌత్ స్టార్ హీరో సూర్య‌కి ఇది మ‌ర‌పురాని పుట్టిన‌రోజు. అత‌డికి జాతీయ అవార్డు రూపంలో ఒక రోజు ముందే బ‌ర్త్ డే గిఫ్ట్ అందింది. సూర‌రై పొట్రులో త‌న న‌ట‌న‌కు జూరీ `ఉత్త‌మ న‌టుడు` అవార్డును క‌ట్ట‌బెట్టింది. ఇది సూర్య లైఫ్ లోనే అత్యంత ఉద్వేగ‌భ‌రిత‌మైన ఆనంద‌క‌ర‌మైన‌ సంద‌ర్భం. ఇక ఇదే హుషారులో అత‌డు వ‌రుస చిత్రాల‌తో అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీటివ్వ‌నున్నాడు.

ఇంత‌లోనే నేటి పుట్టినరోజును పురస్కరించుకుని `వాడివాసల్` నిర్మాతలు ఒక చిన్న మేకింగ్ వీడియోని విడుద‌ల‌ చేశారు. ఈ వీడియోలో సూర్య ఒక పొగ‌రుమోతు ఎద్దును మచ్చిక చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో `నాట్ ఏ టీజ‌ర్` అని క్లారిటీ ఇచ్చారు. వీడియో చివర్లో అత‌డికి చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.

ఇక ఈ వీడియోలో పొగ‌రు మోతు ఎద్దును రింగ్ లోకి వ‌ద‌ల‌గా టీజింగ్ గేమ్ జ‌ల్లిక‌ట్టులో యువ‌కుడైన సూర్య ఎద్దుకు ఎదురెళుతున్నాడు. కానీ దానిని అత‌డు మ‌చ్చిక చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం.

ఇది చిత్రీక‌ర‌ణ కోసం ట్రైనింగ్ ఇచ్చిన‌ ఎద్దు అని కూడా అర్థ‌మ‌వుతోంది. దానిని సూర్య చాలా ఒడుపుగా కంట్రోల్ లో పెడుతున్నాడు. పొగ‌రుమోతు ఎద్దును మ‌చ్చిక చేసుకుని సూర్య ఆశ్చ‌ర్య‌ప‌రిచాడంటూ దీనిపై అభిమానులు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

తమిళ సంస్కృతిలో అంతర్భాగమైన జల్లికట్టు నేపథ్యంలో వాడివాస‌ల్ సినిమా తెర‌కెక్కుతోంది. వంద శాతం సక్సెస్ రేషియో ఉన్న వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైప్పులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జాతీయ అవార్డు అందుకున్న సూర్య రెట్టించిన హుషారుతో ఇప్పుడు వ‌రుస చిత్రాల‌పై దృష్టి సారిస్తున్నారు. జాతీయ అవార్డు డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ తో వాడివాస‌ల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి కూడా వ‌చ్చే ఏడాది జాతీయ‌ అవార్డుల నామినేష‌న్ కి వెళుతుందేమో చూడాలి.