Begin typing your search above and press return to search.
అల్లు అర్జున్ థియేటర్లో సరికొత్త టెక్నాలజీ
By: Tupaki Desk | 7 March 2023 3:05 PM GMTప్రస్తుతానికి తెలుగు సినిమా హీరోలందరూ ఒకపక్క హీరోలుగా నడుస్తూనే... మరోపక్క సైడ్ బిజినెస్ ఏదో ఒకటి చేస్తూ వస్తున్నారు. ఎక్కువ మంది రెస్టారెంట్లు, సినిమా నిర్మాణాల మీద దృష్టి పెడుతుంటే తక్కువ మంది సినిమా హాల్స్ నిర్మాణం మీద దృష్టి పెడుతున్నారు.
అలా సినిమా హాల్ నిర్మించిన మొట్టమొదటి హీరోగా మహేష్ బాబు నిలిచారు. ఏషియన్ సంస్థతో కలిసి ఆయన హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ అనే ఒక మల్టీప్లెక్స్ నిర్మించి దానికి సంబంధించిన వ్యాపారకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఆయన తరువాత విజయ్ దేవరకొండ కూడా తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో ఏషియన్ సంస్థతో కలిసి ఒక పెద్ద ధియేటర్ కూడా నిర్మించాడు. అందులో కూడా మల్టీప్లెక్స్ లాగా అనేక స్క్రీన్ ఉన్నాయి. ఇక ప్రభాస్ సైతం నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద మల్టీప్లెక్స్ నిర్మించి థియేటర్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాడు.
ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే బాటలో నడవబోతున్న సంగతి తెలిసింది. అల్లు అర్జున్ ఏషియన్ సంస్థ కలిసి హైదరాబాద్ అమీర్ పేటలో ఉన్న పాత సత్యం థియేటర్ ను కొత్తగా ఇన్నోవేట్ చేశారు.
ఏషియన్ సత్యం మాల్ లో ఏఏ సినిమాస్ పేరిట ఈ కొత్త థియేటర్ ప్రారంభమవుతుంది.ఏషియన్ సత్యం మాల్‌లో తమ 5 స్క్రీన్‌ల మల్టీప్లెక్స్‌తో 'ఓనిక్స్ సినిమా LED' స్క్రీన్‌ని సిటీకి తీసుకువచ్చేందుకు ఏషియన్ అల్లు అర్జున్ (AAA) సినిమాస్ సంస్థ సిద్ధమైంది. ఇంతకుముందు పెద్ద IMAXతో సహా 4 స్క్రీనర్ కోసం ప్లాన్ చేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు.
అందుకే ఇప్పుడు ఓనిక్స్ సినిమా ఎల్ఈడి స్క్రీన్ ని ఈ థియేటర్స్ లో ఇన్ స్టాల్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో ఈ ఏషియన్ సత్యం మాల్ తో పాటు మల్టీప్లెక్స్ కూడా ఓపెన్ చేసేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా నిర్మాణం పూర్తిగా వచ్చిందని ఈ స్క్రీన్స్ ఇన్స్టలేషన్ సహా అనుమతులు కూడా లభిస్తే ఇక అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.