Begin typing your search above and press return to search.
ఒట్టు .. నవ్వుకుంటూనే థియేటర్లలో నుంచి వస్తారు!
By: Tupaki Desk | 3 March 2022 9:40 AM GMTఉమ్మడి కుటుంబాలు .. పెళ్లి చూపుల తతంగాలు .. ఆడవాళ్లు చేసే సందళ్లు .. ఆగడాలకి సంబంధించిన నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో సమస్యలు ఎక్కువగా చూపించేవారు. కన్నీళ్లు కావలసినన్ని కనిపించేవి. విసు .. కోడి రామకృష్ణ వంటి దర్శకులు ఈ తరహా సినిమాలను ఎక్కువగా తీసేవారు.
కుటుంబ కథా చిత్రాలను వాళ్లంతా ఎమోషన్స్ చుట్టూ తిప్పేశారు. అయితే ఇప్పుడు ఆ తరహా సినిమాలు వస్తే చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రేక్షకులకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. థియేటర్లో ఉన్నంతసేపు హాయిగా నవ్వుకోవాలి .. ఆ తరువాత తేలికపాటి మనసుతో బయటపడాలి అంతే.
అందువల్లనే ఆడవాళ్ల పాత్రలను ఎక్కువగా సెట్ చేసుకున్నప్పటికీ, వాళ్ల చుట్టూనే కథ అల్లుకున్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా దర్శకుడు కిశోర్ తిరుమల చూసుకున్నాడు. ఆడవాళ్ల మధ్యకి కన్నీళ్లు రాకుండా చూసుకున్నాడు.
సరదాలకీ .. సందళ్లకి మాత్రమే వాళ్ల మధ్య స్థానం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కొంతసేపటి క్రితం రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. దర్శక నిర్మాతలతో పాటు రష్మిక కూడా హాజరైంది.
ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' రేపు విడుదలవుతోంది. అందరూ కూడా ఫ్యామిలీస్ తో వచ్చి ఈ సినిమాను చూడండి. ఈ సినిమా చూసిన వాళ్లంతా థియేటర్స్ లో నుంచి నవ్వుకుంటూ వెళతారు" అని చెప్పుకొచ్చారు. నిర్మాతగా ఈ మధ్య కాలంలో సుధాకర్ చెరుకూరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వరుస ప్రాజెక్టులను ఆయన లైన్లో పెట్టేస్తున్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే సినిమాలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నారు.
ఈ కథ అంతా కూడా హీరో పెళ్లి ప్రయత్నాలకు సంబంధించిన ఒక యుద్ధంలా కనిపిస్తుంది. అతని పెళ్లి చూపులు .. ఆ సమయంలో ఎదురయ్యే అనుభవాలతో నాన్ స్టాప్ కామెడీగా నడుస్తుంది. తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ నటీమణులైన రాధిక .. ఖుష్బూ .. ఊర్వశీలను కీలకమైన పాత్రల కోసం తీసుకున్నారు. అదే సమయంలో వాళ్ల పాత్రల ద్వారా ఎక్కడా తమిళ ఫ్లేవర్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రేపు విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.