Begin typing your search above and press return to search.
విడాకులు తీసుకున్నా కానీ.. అమీర్ ఖాన్
By: Tupaki Desk | 14 March 2022 2:30 PM GMTబాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ఏదీ చెప్పినా ప్రత్యేకమే. ప్రతి సినిమాని ప్రత్యేకంగా చూస్తూ కొత్త దనాన్నా ప్రేక్షకులకు పరిచయం చేయాలని తపించే నటుల్లో అమీర్‌ఖాన్ ముందు వరుసలో వుంటారు. `యాదోంకీ బారాత్` సినిమాలో ఆయన నట ప్రస్థానం 1973లో మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ రైటర్‌గా తన చిత్రాలకు పని చేస్తూ వచ్చిన అమీర్ ఖాన్ `ఖయామత్ పే ఖయామత్ తక్` చిత్రంతో సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ ప్రారంభించారు. తొలి ఫిల్మ్ ఫేర్ ని సొంతం చేసుకుని తన ప్రత్యేకతను చాటుకున్నారు.
తనదైన మార్కు చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న అమీర్‌ఖాన్ బాలీవుడ్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. నేడు ఆయన తన 57వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. మీడియా మెంబర్స్ తో కలిసి ముంబైలో ప్రత్యేకంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో నటించిన ఆయన త్వరలోనూ ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో తెలుగు హీరో నాగచైతన్య బాలీవుడ్ తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్‌బంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ అమీర్ ఖాన్ కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇటీవల శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ సంస్థ నిర్మించిన `లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమీర్ ఖాన్ ప్రత్యేకంగా హైదరాబాద్ రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం తెలిసిందే.
ఇదిలా వుంటే గత కొంత కాలంగా బాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలని అందిస్తూ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా చెరగని ముద్ర వేసుకున్న అమీర్ ఖాన్ తన పుట్టిన రోజు సందర్భంగా తన మాజీ భార్యల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమీర్ ఖాన్ 2002లో రీనాని వివాహం చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెకు ఆ తరువాత విడాకులిచ్చారు. 2005లో కిరణ్ రావుని వివాహం చేసుకున్నారు.
15 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తనతో విడిపోయి ఇప్పుడు ఒంటరిగా వుంటున్నారు. అయితే ఈ ఇద్దరి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం దృష్టిలో మేము విడాకులు తీసుకున్నామని, అయితే దాన్ని ప్రజలు వేరేలా భావిస్తున్నారని,
సహజంగా భార్యా భర్తలు విడాకులు తీసుకున్నాక ఒకరి గురించి మరొకరు పెద్దగా పట్టించుకోరు కానీ నేను అలా కాదు అన్నారు. ఇప్పటికీ ఇద్దరు భార్యలతో నేను స్నేహంగానే వుంటాను. మట్లాడతాను. పిల్లల విషయంలోనూ కేర్ తీసుకుంటాను` అని షాకింగ్ విషయాలు బయటపెట్టారు అమీర్ ఖాన్.