Begin typing your search above and press return to search.
పేరు మార్చి.. బంధాన్ని పూర్తిగా తెంచేసింది
By: Tupaki Desk | 24 March 2022 11:37 AM GMTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఇటీవలే తన సుదీర్ఘ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ధనుష్ తో ఈమె ప్రేమ.. ఆపై పెళ్లి అంతా కూడా అప్పట్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఇప్పుడు ధనుష్ నుండి విడిపోవడం కూడా చర్చనీయాంశం అయ్యింది. ధనుష్ నుండి విడి పోతున్నట్లుగా ఆమె ప్రకటించి చాలా రోజులు అయ్యింది.
ధనుష్ మరియు ఐశ్వర్య ఇద్దరు కూడా ఒకే సమయంలో తాము విడి పోతున్నట్లుగా ప్రకటించారు. ఆ విషయం లో ఒకరిది తప్పు.. ఒకరిది ఒప్పు అన్నట్లుగా వారు ఏమీ చర్చించుకోలేదు.
కాని వారిద్దరు కూడా విడి పోయి స్నేహం గా ఉంటామని ప్రకటించారు. అయితే విడి పోతున్నట్లుగా ప్రకటించి చాలా రోజులు అయినా కూడా ఆమె ట్విట్టర్ హ్యాండిల్ కు ఐశ్వర్య ధనుష్ అనే ఉండటంతో ఇంకా వీరి బంధం తెగలేదు అనే చర్చ జరిగింది.
మళ్లీ వీరిద్దరు కలిసే అవకాశాలు లేకపోలేదు అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని తాజాగా ఐశ్వర్య తన ట్విట్టర్ ఖాతాకు సంబంధించిన పేరును ఐశ్వర్య ధనుష్ అని కాకుండా ఐశ్వర్య రజినీకాంత్ అంటూ మార్చేసింది. ఇన్నాళ్లు ఎందుకు మార్చలేదు అనే విషయమై సమాధానం లేదు.. కాని ఆమె ఇప్పటికి మార్చడంతో ధనుష్ తో బంధాన్ని ఆమె పూర్తిగా తెంచేసుకున్నట్లే అంటూ సూపర్ స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో పలువురు హీరోయిన్స్ మరియు సెలబ్రెటీలు తమ భర్తల నుండి విడి పోవడానికి ముందే.. అంటే ప్రకటన చేయకుండానే తమ సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన పేర్లను మార్చేవారు. ఉదాహరణ కు సమంత. విడాకులకు కొన్ని నెలల ముందు సమంత తన పేరు నుండి అక్కినేని పదం ను తొలగించిన విషయం తెల్సిందే.
ఇప్పుడు ఐశ్వర్య సినిమాలతో బిజీ అయ్యింది. సాదారణంగా అయితే ఐశ్వర్య రజినీకాంత్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండరు. కాని ఈమద్య ఆమె నుండి మ్యూజికల్ ఆల్బమ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఒక బాలీవుడ్ సినిమా ను కూడా ఈమె ప్రకటించింది. అందుకే ఈమె ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యింది. అందుకే ఇప్పుడు ట్విట్టర్ లో ధనుష్ పేరును తన పేరు నుండి తప్పించినట్లుగా తెలుస్తోంది.