Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు ఆలియా ఇలా షాకిచ్చింది!

By:  Tupaki Desk   |   14 April 2022 10:12 AM GMT
పెళ్లికి ముందు ఆలియా ఇలా షాకిచ్చింది!
X
పెళ్లికి ముందు ఆలియా ఇలా షాకిచ్చింది. ముంద‌స్తు ప్రిప‌రేష‌న్ ఏమో.. ఇదిగో ఇలా క‌నిపించింది. నేచుర‌ల్ బ్యూటీ... ఒరిజిన‌ల్ గా నేను ఇదీ! అనేట్టుగా ఉందీ ఫోటోగ్రాఫ్. ఇందులో మేక‌ప్ లెస్ లుక్ లో వెరీ రెగ్యుల‌ర్ గాళ్ లా క‌నిపించింది. నిజం చెప్పాలంటే ఆలియా ప‌క్కింట‌మ్మాయిలా కనిపిస్తోంది. సాంప్ర‌దాయ ఏపీ ప‌ల్లెటూళ్ల‌లో ఇంత‌కంటే అంద‌గ‌త్తెలు ఎంద‌రినో చూసి ఉంటాం. అన్న‌ట్టు పెళ్లి వేళ మెహందీ వేళ ఆలియా ఎలా ఉంటుందో ఇప్పటికే సోషల్ మీడియాల్లో ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆలియా పెళ్లికి వెళ్లిన చాలామంది సెల‌బ్రిటీలు కొన్ని ఫోటోల్ని కూడా లీక్ చేసారు. అవి వైర‌ల్ గా మారుతున్నాయి.

ఆలియా భట్ -రణబీర్ కపూర్ ఈరోజు(14 ఏప్రిల్) పెళ్లి చేసుకోబోతున్నందున ఆ ఇరు కుటుంబాల‌కు చెందిన‌ ఇళ్లు అంగ‌రంగ వైభ‌వంగా ముస్తాబయ్యాయి. జుహులోని అలియా భట్ ఇల్లు ఆమె పెళ్లికి శోభాయ‌మానంగా ముస్తాబైంది. ఆర్కే ఇల్లు ధేధీప్య‌మైన‌ కాంతుల‌తో మెరిసిపోతోంది. ఆ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. రణబీర్ తల్లి నీతూ కపూర్ - సోదరి రిద్ధిమా కపూర్ గురువారం పెళ్లి జరుగుతుందని ఒక‌రోజు ముందు ముంబై ఫోటోగ్రాఫ‌ర్ల‌కు వెల్ల‌డించారు. అప్ప‌టివ‌ర‌కూ ఇది ఒక ర‌హ‌స్య వివాహంగా మాత్ర‌మే భావించారు అభిమానులు.

ఇప్పుడు ఆలియా - రణబీర్‌ల అలంకరించబడిన ఇళ్ళు వారు ఉన్న వీధులను పరిశీలిస్తే చాలు.. ఈ జంట‌ వివాహం చాలా అందంగా జరగబోతోందని అర్థం చేసుకోవ‌చ్చు. బుధవారం పెళ్లి కార్యక్రమాలు ప్రారంభం కావడంతో జుహులోని అలియా నివాసం లైట్లతో వెలిగిపోయింది. అలియా ఇల్లు తెల్లటి మిల‌మిల‌ల‌తో మెరిసిపోతోంది. పైనుండి క్రిందికి లైట్లతో అలంకరించారు. ఇంత‌కుముందే రణబీర్-ఆలియా పెళ్లికి ముందు వారి నిశ్చితార్థం నుంచి చూడని ఫోటోను పంచుకుంది నీతూ కపూర్. ఎట్ట‌కేల‌కు ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ వివాహాలలో ఒకదానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

నిజానికి ఏడాది కాలంగా ఈ పెళ్లిపై వ‌రుస క‌థ‌నాలొస్తున్నాయి. 2020 డిసెంబర్ లో రణబీర్ కపూర్-ఆలియా భట్ ల‌ పెళ్లికి రిషి కపూర్ గ్రాండ్ వేడుకను ప్లాన్ చేస్తున్నాడని సుభాష్ ఘాయ్ వెల్లడించారు. అత‌డు చెప్పిన విధంగానే రణబీర్ పాలీ హిల్ నివాసాన్ని అలంకరించారు. దాని ముందు వీధి కూడా చెట్లకు వేలాడుతున్న లైట్లతో వెలిగిపోతోంది. ఆ ప్రదేశానికి సంబంధించిన వీడియోలో అభిమానులు ఆ ప్రాంతం చుట్టూ గుమిగూడి క‌నిపించారు. ఫ్యాన్స్ ని ఆ వాతావ‌ర‌ణం ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది.

ఏప్రిల్ 14న వివాహం జరుగుతుందని నీతు మరియు రిద్ధిమా స్వయంగా ధృవీకరించగా రణబీర్ మామ రణధీర్ కపూర్ పెళ్లి ఏప్రిల్ 15న జరగనుందని గతంలో చెప్పారు. దాంతో కొంత సందిగ్ధ‌త ఉన్నా కానీ నిన్న‌టికి అన్ని విధాలా క్లారిటీ వ‌చ్చింది.

బుధవారం రణబీర్ నివాసం 'వాస్తు'లో హల్దీ- మెహందీ వేడుకలు జరిగాయి. రణబీర్ సన్నిహిత కుటుంబ సభ్యులైన నీతూ- రిద్ధిమా ఆమె కుమార్తె సమారా- కరీనా కపూర్ -కరిష్మా కపూర్- రిమా జైన్- అర్మాన్ జైన్- శ్వేతా నందా - కుమార్తె నవ్య నవేలి నందా ఈ వేడుకలో కనిపించారు. అలియా వైపు నుండి ఆమె తల్లి సోనీ రజ్దాన్- తండ్రి మహేష్ భట్ .. సోదరీమణులు పూజా భట్ - షాహీన్ భట్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

వివాహ వేడుకలు ప్రారంభం కాగానే.. ఆలియా - రణబీర్ ల 'బ్రహ్మాస్త్ర' బృందం కూడా జంటకు అభినందన సందేశాలు రాసింది. వారిద్దరికీ బహుమతిగా 'బ్రహ్మాస్త్ర' నుండి రొమాంటిక్ స్టిల్స్ వారి అభిమానుల కోసం ఆవిష్కరించారు. ఇది కేసరియా పాట విజువ‌ల్ ని కూడా పంచుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా బ్రహ్మాస్త్రా ఈ ఏడాది సెప్టెంబర్ 9న థియేటర్లలోకి రానుంది.

పెళ్లి వేళ క‌పూర్ ల సంద‌డి!ఈ పెళ్లిలో అంతా క‌పూర్ల సంద‌డే. రణబీర్ కపూర్ - అలియా భట్ వివాహంలో నవాబ్ సైఫ్ అలీ ఖాన్ - అతని బేగం కరీనా కపూర్ ఖాన్ సంప్రదాయ దుస్తులలో అద్భుతంగా కనిపిస్తున్న వీడియో తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. అలియా భట్ - రణబీర్ కపూర్ ల‌ వివాహం కేవలం కుటుంబ సభ్యులు .. సన్నిహితులతో మాత్రమే సన్నిహితంగా జ‌రుగుతోంది.