Begin typing your search above and press return to search.

చినపోయిన తర్వాత నెం.1 దక్కించుకున్న సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   23 March 2022 4:32 AM GMT
చినపోయిన తర్వాత నెం.1 దక్కించుకున్న సూపర్‌ స్టార్‌
X
కన్నడ సినిమాల బడ్జెట్‌ మరియు మార్కెట్‌ పరిది చిన్నది. పాతిక కోట్ల బడ్జెట్‌ ను భారీ బడ్జెట్‌ సినిమా అని.. 50 కోట్ల బడ్జెట్‌ సినిమా ను మహా బడ్జెట్‌ సినిమా అంటూ ఉంటారు. కాని అక్కడ రికార్డులు అన్ని చెరిపేసేలా కేజీఎఫ్‌ సినిమా ను భారీ బడ్జెట్‌ తో తెరకెక్కించి.. కన్నడ సినీ పరిశ్రమ ఎప్పుడు చూడని వందల కోట్ల వసూళ్లను కేజీఎఫ్ చిత్రం తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మరియు హీరో యశ్‌ లు చూపించడం జరిగింది.

కన్నడ సినీ చరిత్రలో వసూళ్ల విషయంలో కేజీఎఫ్ సినిమా నెం.1 అనడంలో సందేహం లేదు. ఆ నెం.1 స్థానంను కేజీఎఫ్ 2 ఆక్రమించుకుని.. నెం.2 గా కేజీఎఫ్‌ మొదటి పార్ట్ నిలుస్తుందని అంతా భావించారు.

కాని అనూహ్యంగా లెక్కలు మారిపోయాయి. కేజీఎఫ్ 2 రాక ముందే నెం.1 హోదాను కేజీఎఫ్ మొదటి పార్ట్‌ కోల్పోయింది. ఇప్పుడు కేజీఎఫ్ నెం.2 గా ఉంది. కేజీఎఫ్ 2 వస్తే అది కాస్త నెం.3 కి పోయే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.

దివంగత సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్ కుమార్‌ నటించిన జేమ్స్ సినిమా కారణంగానే కేజీఎఫ్ లెక్కలు తప్పాయి. పునీత్‌ రాజ్ కుమార్‌ చివరి సినిమా అవ్వడంతో పాటు జనాల్లో విపరీతమైన ఆసక్తిని జేమ్స్ క్రియేట్‌ చేయడం లో సక్సెస్ అయ్యింది. కనుక జేమ్స్ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. కర్ణాటకలో గతంలో కేజీఎఫ్ సాధించిన వసూళ్లకు మరింత అదనంగా పునీత్‌ రాజ్ కుమార్‌ జేమ్స్ చిత్రంతో వసూళ్లు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

పునీత్ చనిపోక ముందే జేమ్స్‌ సినిమా దాదాపుగా పూర్తి అయ్యింది. ఆ సినిమా ను విడుదల చేయడం కోసం శివ రాజ్ కుమార్ తో పాటు పలువురు కన్నడ సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు. ఇటీవల పునీత్‌ మొదటి జయంతి సందర్బంగా భారీ ఎత్తున సినిమా ను విడుదల చేశారు. రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణం కనిపించింది. గతంలో ఎప్పుడు ఏ సినిమా కు ఈ స్థాయి రిలీజ్ దక్కలేదు అంటూ ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేజీఎఫ్ సినిమా రికార్డు ను బద్దలు కొట్టి కేవలం నాలుగు రోజుల్లోన జేమ్స్ సినిమా ఏకంగా 100 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ రికార్డు ను కేజీఎఫ్‌ 2 బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. పాన్ ఇండియా లెవల్‌ లో కాకుండా కర్ణాటక పరిధిలో కేజీఎఫ్ 2 సినిమా జేమ్స్ రికార్డు ను బద్దలు కొట్టడం కాస్త కష్టం కావచ్చు అంటూ టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి పునీత్‌ రాజ్ కుమార్‌ చనిపోయిన తర్వాత నెం. 1 స్థానం దక్కించుకోవడం పట్ల ఆయన అభిమానులు కన్నీటితో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.