Begin typing your search above and press return to search.
మహేష్ ఫ్యాన్స్ ని వెంటాడుతున్న సెంటిమెంట్ భయం
By: Tupaki Desk | 24 March 2022 8:45 AM GMTసినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్ లకు పెద్ద పీట వేస్తుంటుందన్నది తెలిసింది. సినిమా ప్రారంభానికి, ఫస్ట్ లుక్ రిలీజ్‌కి, టీజర్, ట్రైలర్ రిలీజ్ లకి ముహూర్తలు చూసుకుని మరీ రిలీజ్ చేస్తుంటారు. అంతే కాకుండా పేర్లని కూడా సంఖ్యా శాస్త్రం ప్రకారం మార్చుకుంటుంటారు. అలా మార్చుకుంటే కెరీర్ మారుతుందని. ఉదాహరణకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరుని `అర్జున్ రెడ్డి` సినిమా టైటిల్స్ లో విజయ్ సాయి దేవరకొండ అని వేశారు. ఆ తరువాత నుంచి ఆయన పేరులో వున్న సాయి అనే పదాన్ని తొలగించి విజయ్ దేవరకొండ అని వేస్తున్నారు.
ఇంతలా సెంటిమెంట్ లకు పెద్ద పీట వేసే ఇండస్ట్రీలో ప్రతీదాన్నీ సెంటిమెంట్ తో చూస్తుంటారు. పైకి ఏమీ లేదని చెబుతున్నా.. హీరోలకు అడ్వాన్స్ ఇచ్చే సమయాన్ని కూడా సెంటిమెంట్ గా భావించి అడ్వాన్స్ ఇస్తుంటారట. మరీ ఇంతలా సెంటమెంట్ లు ఫాలో అవుతున్న ఇండస్ట్రీలో మహేష్ ని , మహేష్ అభిమానుల్ని ఓ సెంటిమెంట్ కలవరపెడుతోంది. సినిమా ప్రారంభం దగ్గరి నుంచి సెంటిమెంట్ లని ఫాలో అవుతుంటారు సూపర్ స్టార్ మహేష్.
ఆయన తన సినిమా ఓపెనింగ్ కి ఏనాడూ రాలేదు. అది ఆయన సెంటిమెంట్. ఆయన రాకుండా మహేష్ వైఫ్ నమ్రత ఓపెనింగ్ సెర్మనీల్లో పాల్గొంటూ వుంటుంది. ఇటీవల త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ కి కూడా సెంటిమెంట్ కారణంగానే మహేష్ కనిపించలేదు. అంతా సెటిమెంట్ లని నమ్మే మహేష్ కు, మహేష్ అభిమానులకు మే నెల అంటే టెర్రర్. కారణం ఈ నెలలో విడుదలైన మహేష్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వైఫల్యాలని చవి చూశాయి.
2016 మే 20న విడుదలైన `బ్రహ్మోత్సవం` ఎలాంటి ఫలితాన్నిఅందించిందో అందరికి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ మూవీని పీవీపీ సినిమా బ్యానర్ పై పీవీపీ నిర్మించారు. మహేష్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా ఈ మూవీని విమర్శకులు అభివర్ణించారు. 2003లో జనవరికి `ఒక్కడు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న మహేష్ అదే ఇయర్ మే 23న `నిజం`తో భారీ ప్లాప్ ని సొంతం చేసుకున్నారు.ఇక 2004 మే 14న విడుదలైన `నాని` కూడా ఇదే ఫలితాన్ని అందించింది. `ఖుషీ` వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన ఎ.ఎ.జె. సూర్య ఈ మూవీతో భారీ డిజాస్టర్ ని సంతం చేసుకున్నాడు.
అయితే గత కొంత కాలంగా మహేష్ ని పట్టిపీడిస్తున్న ఈ సెంటమెంట్ ని `మహర్షి` మూవీ బ్రేక్ చేసింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ చేసిన ఈ మూవీ 2019 మే 9న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లని రాబట్టి 100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఇప్పడు మరోసారి మే నెలలో మహేష్ నటించిన మరో చిత్రం `సర్కారు వారి పాట` రాబోతోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మే 12న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. ఈ మూవీ `మహార్షి` తరహాలోనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.